Harish Rao Thanneeru
СтатистикаFormer Minister | MLA from Siddipet | Telangana State. www.harishrao.co.in
- Последний пост
- 3 мар. 2025 г.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 0
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- te
- В каталоге с
- 15 авг.
- 1/24сутки в ленте
- —
- 1/48двое суток
- —
- 1/72трое суток
- —
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ 🔥 బీఆర్ఎస్ హయాంలో SLBC పనులు జరగలేదని నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. లేదంటే రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తారా ?
https://x.com/brsharish/status/1851094961074446439?s=46&t=iIisDuhURU6c7v0zsLSt0w Telangana has seen a significant decline in new company registrations from July to September 2024-25 compared to the same period in 2023-24, according to the Ministry of Corporate Affairs latest report. This drop indicates reduced capital investment, fewer job opportunities, and consequently, lower direct and indirect tax collections. The current Congress government in Telangana, led by Chief Minister @revanth_anumula claims they are promoting startups and entrepreneurship through initiatives like Startup Telangana. However, the decline in new company registrations suggests they have failed in achieving this goal. This is the “MARPU” (change) Congress has brought to Telangana. #CongressFailedTelangana
పది నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్లెక్కి నిరసనలు తెలియజేసే దుస్థితి... పురుగుల్లేని భోజనం కోసం గురుకుల పిల్లలు.. స్కాలర్ షిప్పుల కోసం విద్యార్థులు.. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు.. రుణమాఫీ, రైతు బంధు కోసం రైతన్నలు.. జీతాల కోసం ఆశాలు, అంగన్ వాడీలు.. డీఏ, పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు.. నిధులు విడుదల చేయాలంటూ గ్రామ పంచాయతీ సిబ్బంది.. ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తూ పల్లె ప్రజలు.. ఇండ్లు కూలగొట్టొద్దని హైడ్రా బాధితులు.. సమస్యలు పరిష్కరించాలంటూ పోలీసులు.. పింఛన్లు పెంచాలంటూ వృద్ధులు.. ఇలా రాష్ట్రంలో బడిలో చదువుకునే పిల్లల నుంచి పింఛన్లు అందుకునే అవ్వాతాతల వరకు అందర్నీ సక్సెస్ ఫుల్ గా రోడ్ల మీదకు తెచ్చినవు. కేసీఆర్ గారు పదేళ్ల కాలంలో అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటే.. పది నెలల పాలనలో నువ్వు అందరి కడుపు కొట్టినవు. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచినవు.
ఎన్నికల ముందు నేను పోలీస్ బిడ్డను అంటూ పెద్ద పెద్ద పొంకనాలు కొట్టి, ఇవ్వాళ పోలీసులు తమ కుటుంబ సభ్యులను తామే అరెస్ట్ చేసే దుస్థితిని తెచ్చాడు రేవంత్ రెడ్డి. ఇవ్వాళ తెలంగాణలో రక్షక భటులకే రక్షణ లేని రాక్షస పాలన నడుస్తుంది. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.
అడ్డగోలు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చినాక విద్యార్థులను, నిరుద్యోగులను చివరికి ఉద్యోగులను కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
కంచెలు లేని పాలన కాదు..! కర్ఫ్యూ ల పాలన ఇది.!!
https://x.com/BRSHarish/status/1827970971720204288?t=tffC5rrXHldXVjFYJX5xRw&s=19
https://www.facebook.com/share/v/Z7LnTJwtdMDkcDWn/?mibextid=ng2Npd
https://x.com/BRSHarish/status/1820659833760362721 తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడు, సిద్ధాంతకర్త, ఉద్యమ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఘన నివాళి. ఆయన చూపిన మార్గంలో, కెసిఆర్ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో జయశంకర్ గారిది ప్రత్యేక స్థానం. జయహో జయశంకర్ సర్.. పిడికిలెత్తి పలుకుతోంది తెలంగాణ జోహార్.
https://x.com/BRSHarish/status/1820013807995076910 నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సరైన భోజనం లేక ఆకలితో ఉన్న విద్యార్థులు కారం, నూనెతో అన్నం కలుపుకుని కడుపు నింపుకొన్నారు. ప్రభుత్వం భావిభారత పౌరుల పట్ల ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం బాధాకరం. విద్యార్థులకు పౌష్టికాహారం కోసం అందించే సిఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం, ఇప్పుడు మధ్యాహ్న భోజనం అందించడంలో తీవ్రంగా విఫలమైంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి భోజన సామాగ్రి బిల్లులు, కుక్ కమ్ హెల్పర్ల వేతనాలు పెండింగ్ ఉండడం వల్ల విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు వెంటనే స్పందించి, మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను, కార్మికుల జీతాలను చెల్లించి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కడుపు నింపాలని కోరుతున్నాను.
చీప్ మినిస్టర్ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన హరీష్ రావు రేవంత్ రెడ్డి.. నాకు మంత్రి పదవి ఎవరి భిక్ష వల్లనో రాలేదు. శ్రీమతి సోనియా గాంధీ గారి కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాము తప్ప పదవుల కోసం కాదు. నాకు మంత్రి పదవి వచ్చినపుడు టీ ఆర్ ఎస్ లోనే ఉన్నావ్.. ఆ ఊరేగింపులోనూ ఉన్నావు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా నా వెనకే ఉన్నావ్, నిక్కి నిక్కి చూశావ్. ఇదంతా నీ కళ్ల ముందు జరిగిందే. కానీ ఇవేమి తెలియనట్లు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నావు. పదవులు, విలువల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో పదవులను గడ్డి పోచలుగా త్యజించిన చరిత్ర మాది. పూటకో పార్టీ మారిన రాజకీయ చరిత్ర నీది. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర నీది. ముఖ్యమంత్రి అయినప్పటికీ హుందాగా ప్రవర్తించడం లేదు. చీఫ్ మినిస్టర్ గా కాకుండా, చిల్లరగా మాట్లాడే చీప్ మినిస్టర్ గా వ్యవహరిస్తున్నావు. #CheapMinister
బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడిన సీఎం.. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని అసెంబ్లీలో సీఎం ఛాంబర్ ముందు బైఠాయించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. బయటకు తీసుకొచ్చిన మార్షల్స్ బయటే నిరసనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన పోలీసులు.
దశాబ్దాల కల నెరవేరిన రోజు.. అణగారిన వర్గాల పండుగ రోజు
https://x.com/BRSHarish/status/1818904095429738600 ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును స్వాగతిస్తున్నాం. గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలంగాణ ఉద్యమం నుంచే బిఆర్ఎస్ పోరాటం చేస్తున్నది. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు ఆనాడే ఎస్సీ వర్గీకరణ కోసం డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపిన విషయం అందరికి విదితమే. ఎస్సీ వర్గీకరణ చేయాలని 16మే, 2016 నాడు ప్రధాని మోదీని స్వయంగా కలిసి లేఖ ఇచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, తద్వారా విద్య, ఉద్యోగ అవకాశాల్లో యువతకు అవకాశం కల్పించాలని కోరుతున్నాను.
https://www.facebook.com/share/v/nsgySuqzXSmit9sx/?mibextid=ng2Npd
https://x.com/BRSHarish/status/1818558896967172382?t=zWL9p8R1d_-Vfj_9748BjQ&s=08 నిండు అసెంబ్లీ సాక్షిగా బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సభానాయకులు, రేవంత్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానం. ముఖ్యమంత్రి గారు వెంటనే బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ సమావేశాలు ఎంతో హుందాగా నిర్వహించాం. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ, ప్రతిపక్షాల గొంతును నొక్కుతూ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి గర్హనీయం. 👉ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతిపక్షంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమే తప్పా.? 👉రైతన్నల ఆత్మహత్యలు, నేతన్నల మరణాలు, ఆటో కార్మికుల బలవన్మరణాలపై ప్రభుత్వాన్ని నిలదీడయడమే మేము చేసిన తప్పా.? 👉విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పట్ల అసెంబ్లీ సాక్షిగా గొంతెత్తడమే మేము చేస్తున్న తప్పా.? మందబలంతో కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న ఈ దురహంకారాన్ని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. కాంగ్రెస్ చేస్తున్న ఒక్కో తప్పును లెక్కబెడుతున్నరు.
https://x.com/BRSHarish/status/1817562359336165591?t=0E5zX3ae_W5p6JNt2eQIxw&s=19 రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయి. 8 నెలల్లో 500 హత్యలు జరిగాయని నేను అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మర్నాడే హైదరాబాద్‌లో రెండు హత్యలు జరగడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. హోం మంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై ఇంతవరకు పోలీసులతో సమీక్ష నిర్వహించలేదు. హత్యలు, అత్యాచారాలు యథేచ్ఛగా జరుగుతున్నా ప్రభుత్వానికి, పోలీసులకు చీమ కుట్టినట్టయినా లేదు. ప్రజల మానప్రాణాలను రక్షించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాల్లో లా అండ్ ఆర్డర్ లేకపోవడం బాధాకరం. శాంతి భద్రతల నిర్వహణలో సీఎం, పోలీసులు పూర్తిగా విఫలయ్యారని చెప్పడానికి రోజురోజుకూ పెరుగుతున్న నేరాలే నిదర్శం. ప్రభుత్వం ఇప్పటికైనా నిద్ర మేల్కొని వెంటనే శాంతిభద్రతలను పునరుద్ధరించాలి. గత పదేళ్లలో హైదరాబాద్ సహా తెలంగాణ నెలకొల్పిన శాంతి భద్రతల కారణంగా వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ఈరోజు ఇలాంటి పరిస్థితులు చూస్తే రాష్ట్ర ప్రతిష్టతో పాటు హైదరాబాద్ ప్రతిష్ట కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఫలితంగా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులపై ప్రభావం పడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. సంఘ విద్రోహశక్తులపై ఉక్కుపాదం మోపాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఏమాత్రం సరికాదు. సీఎం రాజకీయాలకు అతీతంగా స్పందించి, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడంపై దృష్టి సారించాలని కోరుతున్నాను.
https://x.com/brsharish/status/1817563778197922037?s=46&t=iIisDuhURU6c7v0zsLSt0w “Each betrayal begins with trust.” These quote is more apt for Congress. *Betrayal =Congress* హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ కు అలవాటుగా మారింది. అధికారంలోకి రాగానే, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్, నేడు మాట తప్పింది. ఎల్ ఆర్ ఎస్ పేరిట ఫీజు వసూలు చేసేందుకు సిద్దమైంది. నో ఎల్.ఆర్.ఎస్ - నో బీ.ఆర్.ఎస్ అంటూ గతం లో ప్రజలను రెచ్చగొట్టి ఇపుడు ఎల్.ఆర్.ఎస్ కు ఫీజులు వసూలు చేస్తామనడం కాంగ్రెస్ నేతల మోసపూరిత మాటలకు నిదర్శనం. కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా, గతం లో తాము చేసిన ప్రకటనలకు అనుగుణంగా ఎల్.ఆర్.ఎస్ ను ఎలాంటి ఫీజులు లేకుండా అమలు చేయాలి. లేదంటే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా.
https://www.facebook.com/share/v/z2rhmKUzDvfFq84S/?mibextid=WC7FNe
https://x.com/brsparty/status/1817218343318782303?s=46&t=iIisDuhURU6c7v0zsLSt0w https://www.facebook.com/share/v/5XPgsEjDr7fumm1T/?mibextid=WC7FNe