tgindex
KKTV2

భగవద్గీత 700 శ్లోకాలను ప్రతిరోజు కొన్ని క్రమం తప్పకుండా నేర్చుకుంటే పూర్తిగా చదవడం నేర్చుకోవడం అవుతుంది ఈ మహా యజ్ఞానికి మీకు ఆహ్వానం

Последний пост
6 авг.
Последнее чтение
13 авг.
Постов за неделю
0
Всего постов
20
Тип
открытый
Язык
te
В каталоге с
13 авг.
Подписчики
432
0 за 1 дн.
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
156
20 постов
Вовлечённость
36,1%
к подписчикам
Постов в день
0,0
всего 20
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
102
1/48двое суток
116
1/72трое суток
126

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • без подписи

  • 6 авг.61из telugu_e_books

    без подписи

  • https://youtube.com/shorts/9azYpuEnKvo?si=0Dy0QtWIGkvR91Sa

  • *పండుగ/పూజ సంబంధ 55 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి చదువుకోగలరు* ------------------------------------------------ 1 మన పండుగలు https://pdf.freegurukul.org/s/0152 2 పండుగలు పరమార్ధములు https://pdf.freegurukul.org/s/0153 3 నిత్య జీవితంలో పండగలు-పర్వదినాలు https://pdf.freegurukul.org/s/0154 4 పండగలు పరమార్ధములు https://pdf.freegurukul.org/s/0155 5 పూజలు ఎందుకు చేయాలి? https://pdf.freegurukul.org/s/0156 6 ఏ దేవునికి ఏ ప్రసాదం నైవేద్యం పెట్టాలి? https://pdf.freegurukul.org/s/0157 7 ఏ దేవునికి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి? https://pdf.freegurukul.org/s/0158 8 ఏ దేవునికి ఏ విధముగా దీపారాధన చేయాలి? https://pdf.freegurukul.org/s/0159 9 దేవ పూజా రహస్యము https://pdf.freegurukul.org/s/0160 10 సర్వ దేవతా పూజ విధానము https://pdf.freegurukul.org/s/0161 11 సర్వ దేవతా హోమ విధానము https://pdf.freegurukul.org/s/0162 12 పూజ హోమ కల్పతరువు https://pdf.freegurukul.org/s/0163 13 మూర్త్యర్చనా తత్వము https://pdf.freegurukul.org/s/0164 14 సూర్యోపాసన-ఉపాసన-ప్రాణాయామకాండ-1 https://pdf.freegurukul.org/s/0167 15 సూర్యారాధన https://pdf.freegurukul.org/s/0168 16 సూర్యోపాసన https://pdf.freegurukul.org/s/0169 17 సంధ్యా వందనం https://pdf.freegurukul.org/s/0170 18 శివార్చన https://pdf.freegurukul.org/s/0171 19 అర్చన నవనీత https://pdf.freegurukul.org/s/0173 20 శివ ఆరాధన https://pdf.freegurukul.org/s/0174 21 అమ్మ-శివరాత్రి,శివ తాండవం https://pdf.freegurukul.org/s/0175 22 ఇష్ట లింగార్చన విధి https://pdf.freegurukul.org/s/0176 23 రుద్రాభిషేఖము https://pdf.freegurukul.org/s/0177 24 రుద్రాక్షాది మాలలు - ఫలములు https://pdf.freegurukul.org/s/0178 25 శివ పూజ రహస్యాలు-1 https://pdf.freegurukul.org/s/0179 26 స్మార్త శివ పూజ విధానం https://pdf.freegurukul.org/s/0180 27 సహస్ర లింగార్చన https://pdf.freegurukul.org/s/0181 28 పూజావిధానము - రుద్రాభిషేకము https://pdf.freegurukul.org/s/0182 29 లలితారాధన https://pdf.freegurukul.org/s/0193 30 లలితా పూజ విధానము https://pdf.freegurukul.org/s/0194 31 లలితా సహస్రనామ పారాయణ పూజా విధానము https://pdf.freegurukul.org/s/0195 32 అయ్యప్ప పూజా విధి https://pdf.freegurukul.org/s/0198 33 అష్టలక్ష్మీ ఆరాధన-వైభవం https://pdf.freegurukul.org/s/0199 34 నవగ్రహ గాయత్రి https://pdf.freegurukul.org/s/0200 35 బాలానంద-నవగ్రహ పూజా మహిమ https://pdf.freegurukul.org/s/0201 36 హనుమత్ప్రభ https://pdf.freegurukul.org/s/0202 37 శ్రీ రామ నవరాత్రోత్సవకల్పః https://pdf.freegurukul.org/s/0203 38 సాయిబాబా పూజాస్తవములు https://pdf.freegurukul.org/s/0207 39 దత్త మంత్ర సుదార్ణవము -కల్ప, సహస్ర నామ స్తోత్ర,పూజ విధి https://pdf.freegurukul.org/s/0210 40 దత్తాత్రేయ కల్పః - శ్రీ దేవి నిత్యార్చన విధి, నవరాత్రి విధి, పాదుకా పంచ సంవలిత: https://pdf.freegurukul.org/s/0211 41 శరన్నవరాత్రులు - ఆధ్యాత్మిక దృష్టి https://pdf.freegurukul.org/s/0213 42 దేవీ పూజ - దుర్గా సప్తశతి https://pdf.freegurukul.org/s/0214 43 గాయత్రి నిత్య పూజ విధానం https://pdf.freegurukul.org/s/0220 44 ఉగాది https://pdf.freegurukul.org/s/0221 45 శ్రీరామనవమి https://pdf.freegurukul.org/s/0226 46 శ్రీ వేంకటేశ్వర స్వామి కైంకర్యాలు https://pdf.freegurukul.org/s/0227 47 సకలదేవతా పూజ విధానం https://pdf.freegurukul.org/s/0228 48 మహా శివరాత్రి https://pdf.freegurukul.org/s/0229 49 వైకుంఠ ఏకాదశి - ముక్కోటి ఏకాదశి https://pdf.freegurukul.org/s/0230 50 ప్రార్ధనలు నిజంగా పనిచేస్తాయా https://pdf.freegurukul.org/s/0275 51 ఈశ్వర ప్రార్ధనలు https://pdf.freegurukul.org/s/0278 52 భక్తాంజలి https://pdf.freegurukul.org/s/0280 53 ప్రార్ధన https://pdf.freegurukul.org/s/0282 54 పూజలో ఓషదులు - వైద్యం https://pdf.freegurukul.org/s/0150 55 రుద్రాభిషేక మహాత్యం-1 https://pdf.freegurukul.org/s/0151 ఇటువంటి సందేశాలను ప్రతి రోజు పొందుటకు: Whatsapp channel లో join అగుటకు https://whatsapp.com/channel/0029Va9lKGGAYlUJY3vOvs3V Telegram Channel లో join అగుటకు https://t.me/freegurukul ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ Website: www.freegurukul.org Android App: https://play.google.com/store/apps/details?id=freegurukul.org iOS App: https://apps.apple.com/us/app/free-gurukul/id6749449974

  • https://youtube.com/shorts/6soaB_86byI?si=708_vEE_a6zJGRfJ

  • Audio from Anand

  • Audio from Anand

  • *కీర్తనలు/భజనలు/పాటలు సంబంధ 55 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి చదువుకోగలరు* ------------------------------------------------ 1 సంకీర్తన లక్షణము-1 https://pdf.freegurukul.org/s/2347 2 సంకీర్తన మీమాంస https://pdf.freegurukul.org/s/2348 3 ఆంధ్రుల కీర్తన వాంగ్మయ కళాసేవ https://pdf.freegurukul.org/s/2349 4 నాచన సోమన అన్నమయ్య https://pdf.freegurukul.org/s/2350 5 సంకీర్తనల్లో తిరుమల శ్రీనివాసుని ప్రశంస-ఒక పరిశీలన https://pdf.freegurukul.org/s/2351 6 అమృతసారము https://pdf.freegurukul.org/s/2352 7 అన్నమయ్య విన్నపాలు https://pdf.freegurukul.org/s/2353 8 నిత్యపారాయణ పాశురాలు https://pdf.freegurukul.org/s/2354 9 మంగళాశాసన పాశురములు https://pdf.freegurukul.org/s/2355 10 చిత్రముల తిరుప్పావై https://pdf.freegurukul.org/s/2356 11 తిరుప్పావై https://pdf.freegurukul.org/s/2357 12 విడిచిన విరిదండ -తెలుగు తిరుప్పావు https://pdf.freegurukul.org/s/2358 13 గోదా గీత మాలిక https://pdf.freegurukul.org/s/2359 14 అన్నమాచార్య సంకీర్తనామృతము-1,2 https://pdf.freegurukul.org/s/2360 15 అన్నమయ్య కీర్తనలు https://pdf.freegurukul.org/s/2361 16 భావయామి వేంకటేశం - 1,2,3,4,5,6 https://pdf.freegurukul.org/s/2362 17 హరి నీమయమే అంతాను - 1,2,3,4 https://pdf.freegurukul.org/s/2363 18 హరి సేవకే వేంకటేశ మకుటం - 1,2 https://pdf.freegurukul.org/s/2364 19 హరి యేమనెనో అలిగెనో - 1,2,3,4 https://pdf.freegurukul.org/s/2365 20 ముకుందమాల https://pdf.freegurukul.org/s/2366 21 అమృత రామాయణం https://pdf.freegurukul.org/s/2367 22 అన్నమాచార్యులు అమృతవర్షిణి https://pdf.freegurukul.org/s/2368 23 కృష్ణ దాసి -మధుర భక్తి గేయములు https://pdf.freegurukul.org/s/2369 24 తెలుగు తమిళ లాలిపాటలు https://pdf.freegurukul.org/s/2370 25 స్త్రీల నవీన మంగళ హారతులు https://pdf.freegurukul.org/s/2371 26 మంగళ హారతులు https://pdf.freegurukul.org/s/2372 27 పల్నాటి సీమలో కోలాటం https://pdf.freegurukul.org/s/2373 28 కోలాటము పాటలు ఇతర భజనలు https://pdf.freegurukul.org/s/2374 29 పిల్లన గ్రోవి పిలుపులు https://pdf.freegurukul.org/s/2375 30 హంసధ్వని -లలిత గీతాలు https://pdf.freegurukul.org/s/2376 31 పెళ్లి పాటలు-1 https://pdf.freegurukul.org/s/2377 32 శ్రవణానంద మంగళహారతులు https://pdf.freegurukul.org/s/2378 33 స్త్రీ ల వేడుక పాటలు https://pdf.freegurukul.org/s/2379 34 సర్వదేవతా భజనలు https://pdf.freegurukul.org/s/2380 35 108 దివ్య దేశప్పాసుర క్కుటిప్పు https://pdf.freegurukul.org/s/2381 36 అన్నమయ్య సంకీర్తనా స్రవంతి https://pdf.freegurukul.org/s/2382 37 అన్నమాచార్య సంకీర్తనములు-1000 https://pdf.freegurukul.org/s/2383 38 అన్నమాచార్యులవారి అధ్యాత్మ శృంగార సంకీర్తనలు-1,2,3 https://pdf.freegurukul.org/s/2384 39 అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు-10 https://pdf.freegurukul.org/s/2385 40 అధ్యాత్మ సంకీర్తనలు-1,2,3,4,5,7,9,10 https://pdf.freegurukul.org/s/2386 41 అభినవ శ్రీ కృష్ణ లీలలు https://pdf.freegurukul.org/s/2387 42 ఆనంద మంగళం - మధుర భక్తి గీతములు https://pdf.freegurukul.org/s/2388 43 ఎంకి పాటలు https://pdf.freegurukul.org/s/2389 44 కాలజ్ఞాన తత్వములు https://pdf.freegurukul.org/s/2390 45 కృష్ణ తాండవము గోపికా లాస్యము https://pdf.freegurukul.org/s/2391 46 కృష్ణ లీలలు https://pdf.freegurukul.org/s/2392 47 కృష్ణ లీలా తరంగిణి https://pdf.freegurukul.org/s/2393 48 గీత గోవిందము-ఆంధ్రష్టపది https://pdf.freegurukul.org/s/2394 49 చూతపురీ విలాసము https://pdf.freegurukul.org/s/2395 50 తాళ్ళపాక అన్నమయ్య పాటలు https://pdf.freegurukul.org/s/2396 51 తెలుగు మీరా https://pdf.freegurukul.org/s/2397 52 త్యాగరాజ కీర్తన హారము https://pdf.freegurukul.org/s/2398 53 త్యాగరాజ దివ్యనామ సంకీర్తనలు https://pdf.freegurukul.org/s/2399 54 త్యాగరాజ హృదయము https://pdf.freegurukul.org/s/2400 55 త్యాగరాజ కీర్తనలు-3 https://pdf.freegurukul.org/s/2401 ఇటువంటి సందేశాలను ప్రతి రోజు పొందుటకు: Whatsapp channel లో join అగుటకు

  • SU026-DivyaSuktulu.pdf

  • 2 июл.166из sreegita

    https://youtu.be/PMctrs29Iaw?si=03_i4hSbBebnyQyW

  • అసలు కామం అన్న మాటకు జీవితంలో చోటు లేని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే స్వామి హనుమ. అందుకే ఏ గుణమును చూసినప్పటికీ ఆ గుణములు అన్నింటిలో కూడా చిట్టచివరి స్థితిని ఇన్ని గుణములు కలిగిన వాడు ఎవరు? అని అడిగితే చెప్పడం చాలా కష్టం. ఏ మంచి గుణం అయినా దానికి చిట్టచివరి హద్దుగా నిలబడే వారు హనుమ. అంతటి మహానుభావుడు, అంతటి త్యాగనిరతి కలిగిన వాడు, అంతటి స్వామిభక్తి పరాయణుడు. ఇంత గొప్పవాడు అయి ఆయనను పిలిస్తే ఆయన వస్తాడా అంటే చెప్పడం కష్టం. ఆయనను పొగిడితే సంతోషిస్తారా? అంటే చెప్పడం కష్టం. కానీ రామనామం కాసేపు చెప్తే చాలు పరుగెత్తుకు వచ్చేస్తారు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం. తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్. భాష్పవారి పరిపూర్ణ లోచనం. మారుతిం నమత రక్షసాంతకమ్!! అందుకే ఆయనకు మహావీరుడు అని పేరు. వీరుడు అంటే కేవలం శరీర బలం ఒక్కటే కాదు. వీరుడు అంటే అంతటి వేదాంతి. అందుకే రామచంద్రమూర్తి వీరాసనం వేసుకుని కూర్చుంటే వేదాంత పాఠం చెప్తున్నారు అని గుర్తు. ఇప్పటికీ ఒక శ్లోకం చెప్తూ ఉంటారు పెద్దలు. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితమ్ ఆగ్రేవాచయతి ప్రభంజసుతే తత్త్వం మునిభ్యాం పరం వ్యాఖ్యాంతం భరతాదిభిహి పరివృతంరామం భజే శ్యామలం ! అంటారు. అనేకమంది మునులు ఉన్న సభ. భరతాదులు కూడా ఉన్నారు. భరతుడు యువరాజు. కాబట్టి రాజు తర్వాత ఆయన కూర్చోవాలి. కానీ రాముడు వీరాసనం వేసుకుని తత్త్వ ముద్రలో ఉన్నాడు అంటే వేదాంతం చెప్తున్నాడు. అంటే రాముడు గురు స్థానంలో ఉన్నాడు. గురువుకీ, గురు పత్నికీ, గురు పుత్రుడికీ అభేదం. మూడూ గురు స్థానముల క్రిందే నిర్ణయింపబడ్డాయి. అందుకని గురువుగారు వేదాంత ముద్రలో కూర్చుని ఉంటే సాంసారిక బుద్ధితో గురు పత్ని ఉండదు. సీతమ్మ కూడా అప్పుడు వేదాంతమునందే రమిస్తోంది. అందుకే జానకి, సీత అనలేదు. వైదేహీ సహితం –విదేహవంశంలో పుట్టినది. అంటే దేహ భ్రాంతి లేనిదై ఆమె ఉన్నది. అంటే ఆత్మగా ఆవిడ కూర్చుని ఉంది. ఆత్మారాముడై రాముడు కూర్చున్నాడు అంటే గురువుగా కూర్చున్నాడు. అప్పుడు యువరాజు అయినా భరతుడు కూర్చోడు. ‘ఆగ్రేవాచయతి ప్రభంజసుతే’ – వాయు పుత్రుడు అయిన హనుమ కూర్చుంటారు. అంటే వేదాంతాన్ని వినడంలో అంత శ్రద్ధాభక్తులు కలిగినటువంటి శిష్యుడు. రాముడిని సేవించిన వారెందరో ఉంటారు. కానీ ఎప్పుడూ రామ పాదాల దగ్గర నమస్కరిస్తూ కూర్చోగలిగిన వాడు హనుమ ఒక్కరే. అందుకే ఆయనకు మహావీరుడు అని ఒక పేరు. మహావీరుడు అంటే శరీరబలం ఉన్నవాడు అని కాదు. అంతటి వేదాంత ప్రజ్ఞకలిగినటువంటి వాడు అంతటి నిశ్చలమైన మనస్సు ఉన్నవాడు అంతటి ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు, ఇంద్రియములను గెలిచిన వాడు, ఇన్ని గుణములు కలిగిన వాడు అన్ని గుణములు కలిగిన మహా వీరునికి తమలపాకుతో పూజ చేస్తారు. ఎందుకంటే అది బ్రహ్మగారి సృష్టిలో లేని పదార్ధం గనుక, నాగవల్లి అని పేరు ఉంది గనుక అటువంటి వారికి తమలపాకుతో పూజ. అందుకే హనుమ ఒక్కరికీ తమలపాకులతో పూజ చేయుట అనే ప్రక్రియ లోకంలో రావడానికి కారణం అయింది. తమలపాకుతో ఆయనను పూజ చేశాము అంటే ఆయనకు ప్రీతి అని కాదు ఆయన యొక్క గుణముల యందు మనకు ప్రీతి. ఎవరు హనుమ యందు, రాముని యందు భక్తి కలిగి ఉంటారో వాళ్ళను ఆయన సర్వ కాలముల యందు రక్ష చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన గుణముల పట్ల తాదాత్మ్యత పొందాడు అనడానికి గుర్తు హనుమను తమలపాకులతో పూజించుట. https://youtube.com/@kktv2?si=Pxe9EePxUF4yh5SM https://www.instagram.com/p/DaFzcgZTHQZ/?igsh=MTg5dGN3N2d3czYyNQ== https://www.facebook.com/share/18oJLuVRwQ/

  • ప్ర : హనుమకు తమలపాకులతో పూజ ఎందుకు చేస్తారు? జ : హనుమకు తమలపాకులతో పూజ చేయడం అన్నది సర్వ సాధారణంగా ప్రతి దేవాలయంలోనూ కనపడుతూ ఉంటుంది. తమలపాకుకు సంస్కృతంలో నాగవల్లి అని పేరు. అది బ్రహ్మగారి సృష్టిలోంచి వచ్చిన ఆకు కాదు అని ఒక నిర్ధారణ. ఎందుకంటే ఆ ఆకు మొదట ఎక్కడ పుట్టింది అంటే దేవేంద్రుడు తనయొక్క వాహనమైనటువంటి ఐరావతం అనబడే ఏనుగును ఏ స్తంభానికి వేసి కడతాడో ఆ స్తంభానికి ఒక లత పుట్టింది తనంత తానుగా. ఆ పుట్టిన లత నాగవల్లి. నాగ అంటే ఏనుగు. ఏనుగును కట్టిన స్తంభానికి పుట్టిన తీగ కాబట్టి దానికి నాగవల్లి అని పేరు. బేసి సంఖ్యలో పెట్టాలి తాంబూలం పెడితే. మూడు ఆకులు పెట్టండి అని అర్థం. అది అపురూపంగా పుట్టినటువంటి ఆకు అయిన కారణం చేత దానిని పరమ పూజనీయ స్థానములు ఏవి ఉంటాయో ఆయా స్థానముల యందు ఇక నోటితో నేను వారి వైభవాన్ని ఆవిష్కరించలేను. పరమ మర్యాద, పరమ గౌరవం నేను వ్యక్తం చేయాలి అనుకుంటున్నాను అనుకున్నప్పుడు తాంబూల ప్రదానం చేస్తారు. అందుకే ఇంటికి ఎప్పుడైనా పెద్దలు వస్తే తాంబూలం ఇస్తారు. విరాటపర్వంలో అర్జునుడు బృహన్నల వేషంలో వచ్చినప్పుడు విరాట రాజు గారికి అనుమానం వస్తుంది. చూడడానికి పేడి వాడు, కానీ తేజస్సు సామాన్యంగా లేదు. అరివీర భయంకరుడిగా ఉన్నాడు. విశేషమైన పరాక్రమ వంతుడిలా ఉన్నాడు అని ఉత్తరను పిలిచి అర్జునునికి తాంబూలం ఇచ్చి నమస్కారం చేయమన్నాడు. బృహన్నలను చూడగానే అంత గౌరవం వచ్చింది. రెండు ఉత్తరకు నాట్యాచార్యుడు కాబోతున్నాడు. ఆచార్య స్థానంలో కూర్చునే వ్యక్తికి అతని పట్ల గౌరవాన్ని ఆవిష్కరించడానికి ఒకే ఒక్క మార్గం తాంబూలం ఇవ్వడం. అందుకే ఏ మంగళకార్యం అయినా స్థిరం చేసినప్పుడు మొట్టమొదట తాంబూలంతో ప్రారంభం అవుతుంది. తాంబూలాలు పుచ్చుకున్నారు అన్న మాటకు అర్థం మంగళప్రదమైన కార్యాన్ని నిర్ణయించారు అని గుర్తు. అటువంటి తమలపాకులతో హనుమకు పూజ చేస్తారు విశేషంగా. ఎందుచేత అంటే హనుమ యందు ఉండేటటువంటి గుణాలు అన్నీ కూడా ఏ గుణాన్ని చెప్పినప్పటికీ ఆ గుణానికి చిట్టచివరి హద్దు ఏది ఉంటుందో అది ఆయన ఒక్కడే అయి ఉంటాడు. ఏ మంచి గుణమైనా సరే దాని చిట్టచివరి హద్దు ఏదో అదే హనుమ. అపారమైన వేగం ఉన్నవాడు అంటే హనుమ. ఎప్పుడూ భక్తులను రక్షించేవాడు ‘పరిత్రాణాం భయంకరో మిత్రాణాం అభయంకరః” అంటే హనుమ. చాలా తేలికగా ప్రసన్నం అయ్యేవాడు హనుమ. ఇంత వేగంగా వెళ్ళగలిగిన వాడు నిశ్చలంగా కూర్చుని జపం చేయగలిగిన వాడు హనుమ. ఇంద్రియములను అంత గొప్పగా గెలిచిన వాడు హనుమ. గొప్ప బుద్ధిమంతుడు హనుమ. నవవ్యాకరణ పండితుడు హనుమ. గురువుగారిని సేవించి చదువు నేర్చుకోవడంలో ఆయనంత కష్టపడిన వారు ఎవరూ లేరు. సూర్యుడితో కలిసి తిరిగి చదువు నేర్చుకోవడం అంటే మాటలు కాదు. సూర్యుడు భూమికి ప్రదక్షిణగా వెళ్తున్నప్పుడు తానూ వెళ్ళి చదువు నేర్చుకున్నాడు. ఆయన తేజస్సును ఓర్చుకున్నాడు. అందుకే ఆయనంత గురు భక్తి తత్పరుడు లేడు. గురుభక్తి అంటే హనుమ పేరే చెప్పాలి. అలాగే పరోపకారం కోసం అని చెప్పి దీనివల్ల నాకేం వస్తుంది అని అడగకుండా ఎంత ఉపకారం అయినా చేయాలి అంటే ఆయనే. తీవ్రమైన స్థితి హనుమ. రామార్థం వానరార్థంచ చికీర్షన్ కర్మ దుష్కరం. సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్ఛతి!! అంటారు మహర్షి. ఎవరికోసం నూరు యోజనాల సముద్రం దాటాలి? ఎవరికోసం అంత కష్టపడి అన్వేషణ చేయాలి? అంటే రాముడికోసం, వానరుల కోసం. పరోపకారం కోసం అంత కష్టపడడం అంటే హనుమ అద్భుతమైన వాగ్వైభవం అంటే హనుమ. బుద్ధిని ఇవ్వగలిగిన వాడు అంటే హనుమ. రోగనాశనం చేయగలిగిన వాడు అంటే హనుమ. అసలు ప్రాణం పెట్టేవాడు అంటే హనుమ. రామాయణంలో హనుమ ఎక్కడ కనపడితే అక్కడ ప్రాణాలు నిలబడతాయి. అలా ప్రాణాలు నిలబెట్టగలిగిన వాడు హనుమ. అంత బలపరాక్రమాలు ఉండీ, అంత బుద్ధి ఉండీ తనకోసమని తాను ఒకపని చేసుకోని వాడు ఎవరైనా లోకంలో ఉంటే హనుమ ఒక్కడే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే భార్యను స్వీకరించి కూడా కామం కోసం భార్యను స్వీకరించని ఏకైక వ్యక్తి సృష్టిలో హనుమ. లోకంలో ఎవరు భార్యను స్వీకరించినా కామము ధర్మ బద్ధం చేసుకుని సంతానాన్ని పొందడానికి స్వీకరిస్తారు. సువర్చల వరం అడిగింది. కామం లేనివాడు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడానికి ధర్మపత్నిని కోరుకున్న వాడు ఎవరైనా ఉంటే వానికి ఇల్లాలు అవుతాను అన్నది. లోకంలో కామం లేనివాడు, సంతానాన్ని పొందాలన్న అపేక్ష లేనివాడు కానీ గృహస్థాశ్రమంలో ఉంటే తప్ప యజ్ఞయాగాది క్రతువులు చేయడం కుదరదు గనుక అందుకొరకు భార్యను స్వీకరించాలి అనుకున్నవాడు భార్యకు మళ్ళీ సంతానాన్ని పొందాలన్న కోరిక ఉండి భర్త ఆమెను స్వీకరించి ఆమెయందు సంతానాన్ని పొందకపోతే మళ్ళీ అది మహా పాపమై హింస క్రిందకి వస్తుంది. ఇద్దరియందు అదే ప్రవ్రుత్తి. ఆమెకూ సంతానాపేక్ష లేదు, కామము లేదు. ఆయనకూ కామము లేదు, సంతానాపేక్ష లేదు. గృహిణిగా, ఒకరికి ధర్మపత్నిగా ఆయనకు యజ్ఞాధికారం కల్పించాలి. ఆవిడ కోరిక. గృహస్థాశ్రమంలో ఉండి జీవితం పండించుకోవాలి హనుమ కోరిక. అందుకే రామకృష్ణ పరమహంస శారదా దేవిలా ఇద్దరూ కలిసి ఉన్నారు.

  • #5000సంవత్సరాలచరిత్ర #శ్రీపార్వతిదేవిసమేతశ్రీతాండవమల్లేశ్వరస్వామికొత్తపల... https://youtube.com/shorts/oEE6KUWnyzM?si=vjDFtC63f0uJ2BqT

  • *ఉప వేదాంగాలు/బ్రహ్మ సూత్రాలు సంబంధ 45 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి చదువుకోగలరు* ------------------------------------------------ 1 బ్రహ్మ సూత్రాలు https://pdf.freegurukul.org/s/1726 2 శ్రీభాష్యం https://pdf.freegurukul.org/s/1739 3 బ్రహ్మసూత్ర రహస్యము https://pdf.freegurukul.org/s/1736 4 బాదరాయణీయ బ్రహ్మసూత్ర బోధామృత లహరి https://pdf.freegurukul.org/s/1730 5 బ్రహ్మ సూత్రములు-2 భాగము https://pdf.freegurukul.org/s/1731 6 కళ్యాణసుధ https://pdf.freegurukul.org/s/1745 7 బ్రహ్మ మీమాంసా దర్శనము https://pdf.freegurukul.org/s/1752 8 బ్రహ్మసూత్రార్థ చంద్రిక-2 https://pdf.freegurukul.org/s/1735 9 వైయాసిక న్యాయమాల https://pdf.freegurukul.org/s/1728 10 వ్యాససిద్ధాంత మార్తాండము https://pdf.freegurukul.org/s/1729 11 తర్కం-శాస్త్రీయ విధానము https://pdf.freegurukul.org/s/1763 12 సర్వసిద్ధాంత సౌరభవము-5 https://pdf.freegurukul.org/s/1760 13 హేతువాదం https://pdf.freegurukul.org/s/1767 14 సర్వసిద్ధాంత సౌరభవము-2 https://pdf.freegurukul.org/s/1758 15 న్యాయ మీమాంసా దర్శనము https://pdf.freegurukul.org/s/1755 16 సర్వసిద్ధాంత సౌరభవము-4 https://pdf.freegurukul.org/s/1759 17 పూర్వమీమాంస దర్శనము -1 https://pdf.freegurukul.org/s/1753 18 బ్రహ్మ సూత్రములు-2 అధ్యాయము-2 పాదము https://pdf.freegurukul.org/s/1733 19 ద్వాదశ దర్శనాలు https://pdf.freegurukul.org/s/1746 20 శబ్ద యోగ భూమిక https://pdf.freegurukul.org/s/1769 21 బ్రహ్మ సూత్రాలు https://pdf.freegurukul.org/s/1727 22 ఆంధ్రీకృత న్యాయ దర్శనము-1 https://pdf.freegurukul.org/s/1751 23 భారతీయ తత్వశాస్త్రం - సమగ్ర పరిశీలన https://pdf.freegurukul.org/s/1747 24 భారతీయ తత్వ శాస్త్రము-1 https://pdf.freegurukul.org/s/1748 25 న్యాయ వైశేషికములు - సాంఖ్య యోగములు https://pdf.freegurukul.org/s/1770 26 దర్శన కర్తలు - దర్శనములు -3 https://pdf.freegurukul.org/s/1750 27 దర్శన కర్తలు - దర్శనములు -2 https://pdf.freegurukul.org/s/1749 28 ఆంధ్ర మీమాంస న్యాయ ముక్తావళి https://pdf.freegurukul.org/s/1768 29 వైశేషిక మీమాంసా దర్శనము https://pdf.freegurukul.org/s/1766 30 ప్రమాణ పద్ధతిపై ప్రసంగము https://pdf.freegurukul.org/s/1765 31 పాద్మసంహితలోని యోగపాదము - పతంజలి యోగదర్శనము -ఒక పరిశీలనము https://pdf.freegurukul.org/s/1764 32 విశ్వమీమాంస https://pdf.freegurukul.org/s/1762 33 బ్రహ్మ సూత్రములు-2 అధ్యాయము-1 పాదము https://pdf.freegurukul.org/s/1732 34 సర్వసిద్ధాంత సౌరభవము-9 https://pdf.freegurukul.org/s/1761 35 బ్రహ్మసూత్రార్థ చంద్రిక-1 https://pdf.freegurukul.org/s/1734 36 సర్వసిద్ధాంత సౌరభవము-1 https://pdf.freegurukul.org/s/1757 37 సంస్కృత న్యాయములు https://pdf.freegurukul.org/s/1756 38 బ్రహ్మ సూత్ర సారము https://pdf.freegurukul.org/s/1737 39 బ్రహ్మసూత్ర వివృతి-పూర్వార్ధము https://pdf.freegurukul.org/s/1738 40 న్యాయ దర్శనము https://pdf.freegurukul.org/s/1754 41 శ్రీభాష్య సారము-1 https://pdf.freegurukul.org/s/1740 42 శ్రీభాష్య సారము-2 https://pdf.freegurukul.org/s/1741 43 నీలకంఠ శారీరక బ్రహ్మ మీమాంస సూత్ర భాష్యము-చతుస్సూత్రి-1 https://pdf.freegurukul.org/s/1742 44 నీలకంఠ శారీరక బ్రహ్మ మీమాంస సూత్ర భాష్యము-చతుస్సూత్రి-2 https://pdf.freegurukul.org/s/1743 45 చతుస్సూత్రీ-1 https://pdf.freegurukul.org/s/1744 ఇటువంటి సందేశాలను ప్రతి రోజు పొందుటకు: Whatsapp channel లో join అగుటకు https://whatsapp.com/channel/0029Va9lKGGAYlUJY3vOvs3V Telegram Channel లో join అగుటకు https://t.me/freegurukul ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ Website: www.freegurukul.org Android App: https://play.google.com/store/apps/details?id=freegurukul.org iOS App: https://apps.apple.com/us/app/free-gurukul/id6749449974

  • 🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀 *అందరికీ శుభోదయం!* ➖➖➖✍️ *మనం శుభం జరగాలని మనసా,వాచా,కర్మణా వాంఛిస్తే అదే జరుగుతుంది.* *’యద్భావం తద్భవతి’ అన్నారు పెద్దలు.* *అందుచేత అందరికీ మంచి మాత్రమే జరగాలని కోరుకుందాం.* *సమస్త మానవాళి సుఖసంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో సుఖంగా జీవించాలని దీవించే పవిత్ర వేదప్రవచనాన్ని మననం చేసుకుందాం.* *అదే …*👇 *సర్వే జనాః సుఖినోభవంతు... లోకాః సమస్తాః సుఖినో భవంతు!* అని....! 🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀👇 మీకు మీ కుటుంబ సభ్యులందరకూ వేదపండితులచే... నేటి వేద ఆశీర్వచనములు...! మీకు నేడు అన్నియు శుభములు కలుగుగాక...!!✋ 👇👇👇👇👇👇👇👇👇👇

  • Audio from Anand

  • **శ్రీ మూకశంకర విరచిత* *మూక పంచశతి* *పాదారవిందశతకము* *22 వ శ్లోకము* *కదా దూరీకర్తుం కటుదురితకాకోలజనితం* *మహాంతం సంతాపం మదనపరిపంథిప్రియతమే |* *క్షణాత్తే కామాక్షి ! త్రిభువనపరితాపహరణే* *పటీయాంసం లప్స్యే పదకమలసేవామృతరసమ్ ||* *భావము:* *అమ్మా! పరమేశ్వరుని ప్రియురాలా ! కామాక్షీదేవీ ! చేదు అయిన, పాపమనే, విషోద్భవమైన గొప్ప దుఃఖాన్ని దూరం చేయటానికి, మూడు లోకాల పరితాపాన్ని హరించుటయందు సమర్ధమైన నీ చరణకమలాల సేవామృతాన్ని ఎప్పుడు పొందుతానో గదా !* *సౌందర్యలహరి మనకందిస్తూ శ్రీ శంకరులు, "అమ్మా ! నీ పాదసేవ చేసుకుని ఆ పాదోదకం ఎప్పుడు సేవిస్తానో గదా !" అని అమ్మతో చేసే వేడుకోలు ఈ సందర్భంలో స్ఫురణకు వస్తుంది :* *కదా కాలే మాతః - కథయ కలితాలక్తకరసం* *పిబేయం విద్యార్థీ - తవ చరణ నిర్ణేజనజలమ్‌|* *ప్రకృత్యా మూకానా - మపి చ కవితా కారణతయా* *కదా ధత్తే వాణీ - ముఖకమలతాంబూలరసతామ్‌*- *( 98 వ శ్లోకం )* *భావము :* *అమ్మా ! నీ పాదములు ఎర్రగా అందముగా ఉండటానికోసం, నీ అరికాలికి పూతగా ఎర్రని లత్తుక రసము పూయబడివుంటుంది. నీ పాదములు కడిగినప్పుడు ఆ జలము నీ అరికాలి లత్తుక రసముతో కూడి ఎర్రగా శోభిల్లుతుంది. అటువంటి నీ పాదోదకము స్వీకరించినంత మాత్రాన, జన్మతః మూగవారిగా పుట్టినవారు సైతం చక్కగా కవిత్వం చెప్పగలుగుతున్నారు. ఇన్ని అద్భుతాలకు హేతువైన, మహామహిమ కలిగిన, నీ ఎర్రని లాక్షావర్ణ లత్తుకారస మిళితమైన, పాదోదకాన్ని బ్రహ్మవిద్యకై ( బ్రహ్మ జ్ఞానం ) అర్రులు చాచే విద్యార్థినైన నేను నా మరణకాలం లోపులో ఎప్పటికి గ్రోలి ఈ మాయా మోహాంధకారాన్ని విడచి బ్రహ్మజ్ఞానాన్ని పొందగలుగుతానో గదా !* *ఆ తల్లి* *పాదపద్మములకు నమస్కరిస్తూ*

  • వ్రతాలు, దానాలు చేసినా ఫలితం పొందేందుకు ఏ తిథులు శ్రేష్ఠమో తెలుసుకోండి శాస్త్రాల ప్రకారం వ్రతాలు, దానధర్మాలు చేయడానికి కొన్ని నిర్దిష్టమైన తిథులు నిర్ణయించబడ్డాయి. ఈ తిథులలో ఉపవాసాలు, వ్రతాలను ఆచరిస్తే అక్షయమైన పుణ్యఫలం లభిస్తుంది. అయితే వీటికి భిన్నమైన తిథులలో చేసిన దానం ఆశించిన ఫలితాన్ని ఇవ్వదని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. అలాగే ఈ ప్రత్యేక తిథుల్లో ఏ వైదిక కర్మను ఆచరించినా అది విశేష పుణ్యప్రదంగా భావించబడుతుంది. ఇప్పుడు ఆ తిథుల ప్రాముఖ్యాన్ని తెలుసుకుందాం. ముందుగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం తిథుల గురించి తెలుసుకోవాలి. సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం ఉన్నంత కాలం జపం, ధ్యానం, మంత్రపారాయణం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం అత్యంత శ్రేయస్కరమని శాస్త్రాలు చెబుతున్నాయి. గ్రహణం ముగిసిన తరువాత దానధర్మాలకు విశేష ప్రాధాన్యం ఉంది. అందువల్ల సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అనంతరం తప్పకుండా దానం చేయాలని పురాణాలు ప్రత్యేకంగా సూచిస్తున్నాయి. పురాణాల ప్రకారం, *కృష్ణపక్షం, శుక్లపక్షం రెండింటిలో వచ్చే ఏకాదశి తిథుల్లో వ్రతాన్ని ఆచరించడం అత్యంత శ్రేష్ఠమైనది.* అదేవిధంగా ఈ క్రింది తిథుల్లో కూడా వ్రతాలను ఆచరించడం ఉత్తమంగా భావించబడింది: చవితి (చతుర్థి), తదియ (తృతీయ), అష్టమి, షష్ఠి, పౌర్ణమి, చతుర్దశి, అమావాస్య ఈ తిథులు ఉపవాసాలకు, ఆధ్యాత్మిక సాధనకు అత్యంత శుభప్రదమైనవిగా పరిగణించబడుతున్నాయి. వ్రతాలను ఆచరించడానికి శుక్లపక్షం మరింత శ్రేష్ఠమైనదిగా భావించబడింది. ద్వాదశి వ్రతాన్ని ఆచరించే వారు సూర్యోదయ సమయానికి వ్యాపించి ఉన్న ద్వాదశి తిథినే పాటించడం శాస్త్రసమ్మతమైనది. సూర్యుని ప్రతి *సంక్రాంతి* రోజున స్నానం, దానం చేయడం అత్యంత పుణ్యప్రదమైనదిగా భావిస్తారు. ఈ సమయాన్ని *పుణ్యకాలం* అని పిలుస్తారు. ఈ పుణ్యకాలంలో స్నానం, దానధర్మాలు చేయడం అక్షయ ఫలితాలను ప్రసాదిస్తుంది. తులా సంక్రాంతి, మకర సంక్రాంతి, కన్యా సంక్రాంతి ఈ సంక్రాంతి కాలాల్లో స్నానం, దానం, జపం, పూజలు చేస్తే అక్షయ పుణ్యఫలం లభిస్తుంది. సంక్రాంతులలో *కర్కాటక సంక్రాంతిని దక్షిణాయన సంక్రమణం*, *మకర సంక్రాంతిని ఉత్తరాయన సంక్రమణం* అని పేర్కొన్నారు. ఇవే కాకుండా *అమావాస్య, పౌర్ణమి* రోజుల్లో చేసిన దానాలు కూడా విశేషమైన ఫలితాలను అందిస్తాయి. శాస్త్రాల ప్రకారం *సంక్రాంతి, అమావాస్య, వ్యతీపాత యోగం, యుగాది తిథి లేదా ఏదైనా పుణ్యదినంలో చేసిన స్వల్పమైన దానం కూడా కోటి రెట్లు పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది.*

  • ప్రకృతిలక్ష్మ్యై శ్రీలక్ష్మ్యై స్వస్తిలక్ష్మ్యై నమోనమః | నమస్తే గోలోకలక్ష్మ్యై *మహాలక్ష్మ్యై నమోనమఃIl* శక్తి లక్ష్మ్యై భక్తి లక్ష్మ్యై ముక్తి లక్ష్మ్యై నమో నమః| నమస్తే త్రిమూర్తి లక్ష్మ్యై *మహాలక్ష్మ్యై నమోనమఃIl* నమః చక్ర రాజలక్ష్మ్యై ఆదిలక్ష్మ్యై నమో నమః | నమో బ్రహ్మానందలక్ష్మ్యై *మహాలక్ష్మ్యై నమోనమఃIl* *ఇతి సౌభాగ్యలక్ష్మీ స్తోత్రమ్ సంపూర్ణమ్* *ఓం శ్రీ సౌభాగ్యలక్ష్మీ దేవ్యైనమః* *శ్యామలా దండకం* ఈ శ్యామలా నవరాత్రులలో... నిత్యపారాయణగా చేయదగిన స్తోత్రం. మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మాహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమ రాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేక మాత: మాతా మరకతశ్యామా మాతంగీ మధుశాలినీ కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ జయమాతంగతనయే జయనీలోత్పలద్యుతే జయ సంగీతరసికే జయలీలా శుకప్రియే || జయజననీ సుధాసముద్రాంత హృద్యన్మణిద్వీపసంరూఢబిల్వాటవీ మధ్యకల్పద్రుమాకల్పకాదంబకాంతారవాసప్రియే కృత్తి వాస: ప్రియే, సర్వలోకప్రియే, సాదరారబ్ధ సంగీతసంభావనా సంభ్రమాలోలనీపస్రగాబద్ధచూళీ సనాధత్రికే, సానుమత్పుత్రికే శేఖరీభూతశీతాంశురేఖా మయూఖావళీబద్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే, లోకసంభావితే, కామలీలా ధనుస్సన్నిభ భ్రూలతాపుష్ప సందోహ సందేహ కృల్లోచనే, వాక్సుధాశేచనే, చారుగోరోచనాపంకకేళీ లలామాభిరామే, సురామే రమే, ప్రోల్లసద్వాళికా మౌక్తిక శ్రేణికా చంద్రికామణ్డలోద్భాసిలావణ్య గండస్థలన్యస్తకస్తూరికా.. పత్రరేఖాసముద్భూత సౌరభ్య సంభ్రాంత భ్రుంగాంగనాగీత సాంద్రీభవన్మంత్రతంత్రీశ్వరే, సుస్వరే, భాస్వరే, వల్లకీ వాదనప్రక్రియాలోల తాళీదళాబద్ధతాటంకభూషావిశేషాన్వితే, సిద్ధసమ్మానితే, దివ్యహాలామదోద్వేలహేలాల సచ్చక్షురాన్దోళన శ్రీసమాక్షిప్తకర్ణైకనీలోత్పలే, పూరితాశేషలోకాభివాంఛాఫలే, శ్రీఫలే, స్వేదబిందూల్లసత్ఫాలలావణ్య నిష్యంద సన్దోహ సందేహ కృన్నాసికామౌక్తికే, సర్వమంత్రాత్మికే, సర్వవిశ్వాత్మికే, కాళికే, ముగ్ధమందస్మితోదారవక్త్రస్ఫురత్పూగతాంబూల కర్పూర తాంబూలఖండోత్కరే, జ్ఞానముద్రాకరే, సర్వసంపత్కరే, పద్మభాస్వత్కరే, శ్రీకరే, కుందపుష్పద్యుతిస్నిగ్ద దన్తావళీ నిర్మలాలోల కల్లోల సమ్మేళన స్మేర శోణాధరే, చారువీణాధరే, పక్వబింబాధరే, సర్వతీర్థాత్మికే, సర్వమంత్రాత్మికే, సర్వతంత్రాత్మికే, సర్వయంత్రాత్మికే, సర్వపీఠాత్మికే, సర్వతత్వాత్మికే, సర్వశక్త్యాత్మికే, సర్వవిద్యాత్మికే, సర్వయోగాత్మికే, సర్వరాగాత్మికే, సర్వశబ్దాత్మికే, సర్వవిశ్వాత్మికే, సర్వదీక్షాత్మికే, సర్వసర్వాత్మికే, సర్వగేహేజగన్మాత్రికే, పాహిమాం, పాహిమాం, పాహిమాం దేవీ! తుభ్యం నమోదేవీ, తుభ్యం నమో దేవీ! తుభ్యం నమః!! శ్రీ మాత్రే నమః

  • ఓం మతంగతనయాయై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం వ్యాపిన్యె నమః ఓం సర్వరంజిన్యె నమః ఓం దివ్యచందనదిగ్ధాంగ్యై నమః ఓం యావకార్ధపదాంబుజాయై నమః ఓం కస్తూరీతిలకాయై నమః ఓం సుభ్రువే నమః ఓం బింబోష్ఠ్యై నమః |54|| ఓం మదాలసాయై నమః ఓం విద్యారాజ్ఞ్యై నమః ఓం భగవత్యే నమః ఓం సుధాపానానుమోదిన్యె నమః ఓం శంఖతాటంకిన్యె నమః ఓం గుహ్యాయై నమః ఓం యోషిత్పురుషమోహిన్యై నమః ఓం కింకరీభూతగీర్వాణ్యై నమః ఓం కౌలిన్యె నమః |63| ఓం అక్షరరూపిణ్యై నమః ఓం విద్యుత్కపోలఫలికాయై నమః ఓం ముక్తారత్నవిభూషితాయై నమః ఓం సునాసాయై నమః ఓం తనుమధ్యాయై నమః ఓం శ్రీవిద్యాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం పృథుస్తన్యై నమః ఓం బ్రహ్మవిద్యాయై నమః |72| ఓం సుధాసాగరవాసిన్యె నమః ఓం గుహ్యవిద్యాయై నమః ఓం అనవద్యాంగ్యై నమః ఓం యంత్రిణ్యై నమః ఓం రతిలోలుపాయై నమః ఓం త్రైలోక్యసుందర్యె నమః ఓం రమ్యాయై నమః ఓం స్రగ్విణ్యై నమః ఓం కీరధారిణ్యై నమః |81| ఓం ఆత్మైక్యసుముఖీభూతజగదాహ్లాదకారిణ్యై నమః ఓం కల్పాతీతాయై నమః ఓం కుండలిన్యె నమః ఓం కలాధారాయై నమః ఓం మనస్విన్యై నమః ఓం అచింత్యానంతవిభవాయై నమః ఓం రత్నసింహాసనేశ్వర్యై నమః ఓం పద్మాసనాయై నమః ఓం కామకళాయై నమః |90| ఓం స్వయంభూకుసుమప్రియాయై నమః ఓం కళ్యాణ్యె నమః ఓం నిత్యపుష్పాయై నమః ఓం శాంభవీవరదాయిన్యై నమః ఓం సర్వవిద్యాప్రదాయై నమః ఓం వాచ్యాయై నమః ఓం గుహ్యోపనిషదుత్తమాయై నమః ఓం నృపవశ్యకర్యై నమః | ఓం భోక్త్రై నమః |99| ఓం జగత్ప్రత్యక్షసాక్షిణ్యై నమః ఓం బ్రహ్మవిష్ణ్వీశజనన్యై నమః ఓం సర్వసౌభాగ్యదాయిన్యె నమః ఓం గుహ్యాతిగుహ్యగోప్త్రై నమః ఓం నిత్యక్లిన్నాయై నమః | ఓం అమృతోద్భవాయై నమః ఓం కైవల్యదాత్ర్యై నమః ఓం వశిన్యె నమః ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః |108| *ఇతి శ్రీ శ్యామలా అష్టోత్తర శతనామావళి* *శ్రీ సౌభాగ్యలక్ష్మీ స్తోత్రం* ఈ *సౌభాగ్యలక్ష్మీ* స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేయగలరు. ఓం శుద్ధలక్ష్మ్యై బుద్ధిలక్ష్మై వరలక్ష్మై నమోనమః | నమస్తే సౌభాగ్యలక్ష్యై *మహాలక్ష్మ్యై నమోనమఃIl* వశోలక్ష్మై కావ్యలక్ష్మై గానలక్ష్మ్యై నమో నమః | నమస్తే శృంగారలక్ష్మ్యై *మహాలక్ష్మ్యై నమోనమఃIl* ధనలక్ష్మ్యై ధాన్యలక్ష్మ్యై ధరాలక్ష్మ్యై నమోనమః | నమస్తే అష్టైశ్వర్య లక్ష్మై *మహాలక్ష్మ్యై నమోనమఃIl* గృహలక్ష్మ్యై గ్రామలక్ష్మ్యై రాజ్యలక్ష్మ్యై నమోనమః | నమస్తే సామ్రాజ్యలక్ష్మ్యై *మహాలక్ష్మ్యై నమోనమఃIl* శాంతిలక్ష్మ్యై దాంతిలక్ష్మ్యై క్షాంతిలక్ష్మ్యై నమోనమః | నమో అస్త్వాత్మానందలక్ష్మ్యై *మహాలక్ష్మ్యై నమోనమఃIl* సత్యలక్ష్మ్యై దయాలక్ష్మ్యై సౌఖ్యలక్ష్మ్యై నమోనమః | నమః పాతివ్రత్య లక్ష్మై *మహాలక్ష్మ్యై నమోనమఃIl* గజలక్ష్మ్యై రాజ్యలక్ష్మ్యై తేజోలక్ష్మ్యై నమో నమః| నమః సర్వోత్కర్షలక్ష్మ్యై *మహాలక్ష్మ్యై నమోనమఃIl* సత్త్వలక్ష్మ్యై తత్త్వలక్ష్మ్యై భోధలక్ష్మ్యై నమోనమః | నమస్తే విజ్ఞానలక్ష్మ్యై *మహాలక్ష్మ్యై నమోనమఃIl* స్థైర్యలక్ష్మ్యై వీర్యలక్ష్మ్యై ధైర్యలక్ష్మ్యై నమోనమః | నమస్తే స్త్వాదార్యలక్ష్మ్యై *మహాలక్ష్మ్యై నమోనమఃIl* సిధ్ధిలక్ష్మ్యై ఋద్ధిలక్ష్మ్యై విద్యాలక్ష్మ్యై నమోనమః| నమస్తే కళ్యాణలక్ష్మ్యై *మహాలక్ష్మ్యై నమోనమఃIl* కీర్తిలక్ష్మ్యై మూర్తి లక్ష్మ్యై వర్చోలక్ష్మ్యై నమోనమః | నమస్తే త్వనంతలక్ష్మ్యై *మహాలక్ష్మ్యై నమోనమఃIl* జపలక్ష్మ్యై తపోలక్ష్మ్యై వ్రతలక్ష్మ్యై నమో నమః|| నమస్తే వైరాగ్యలక్ష్మ్యై *మహాలక్ష్మ్యై నమోనమఃIl* మంత్రలక్ష్మ్యై తంత్ర లక్ష్మ్యై యంత్రలక్ష్మ్యై నమోనమః | నమో గురుకృపాలక్ష్మ్యై *మహాలక్ష్మ్యై నమోనమఃIl* సభాలక్ష్మ్యై ప్రభాలక్ష్మ్యై కళాలక్ష్మ్యై నమోనమః | నమస్తే లావణ్య లక్ష్మ్యై *మహాలక్ష్మ్యై నమోనమఃIl* వేదలక్ష్మ్యై నాదలక్ష్మ్యై శాస్త్ర లక్ష్మ్యై నమో నమః| నమస్తే వేదాంతలక్ష్మ్యై *మహాలక్ష్మ్యై నమోనమఃIl* క్షేత్ర లక్ష్మ్యై తీర్థ లక్ష్మ్యై వేదిలక్ష్మ్యై నమో నమః | నమస్తే సంతానలక్ష్మ్యై *మహాలక్ష్మ్యై నమోనమఃIl* యోగలక్ష్మ్యై భోగలక్ష్మ్యై యజ్ఞలక్ష్మ్యై నమోనమః | క్షీరార్ణవ పుణ్య లక్ష్మ్యై *మహాలక్ష్మ్యై నమోనమఃIl* అన్నలక్ష్మ్యై మనోలక్ష్మై ప్రజాలక్ష్మ్యై నమోనమః | విష్ణువక్షో భూషణలక్ష్మ్యై *మహాలక్ష్మ్యై నమోనమఃIl* ధర్మలక్ష్మ్యై అర్థలక్ష్మ్యై కామలక్ష్మ్యై నమోనమః | నమస్తే నిర్వాణలక్ష్మ్యై *మహాలక్ష్మ్యై నమోనమఃIl* పుణ్య లక్ష్మ్యై క్షేమలక్ష్మ్యై శ్రద్ధాలక్ష్మ్యై నమోనమః || నమస్తే చైతన్యలక్ష్మ్యై *మహాలక్ష్మ్యై నమోనమఃIl* భూలక్ష్మ్యై తే భువర్లక్ష్మ్యై సువర్లక్ష్మ్యై నమోనమః | నమస్తే త్రైలోక్యలక్ష్మై, *మహాలక్ష్మ్యై నమోనమఃIl* మహాలక్ష్మ్యై జనలక్ష్మ్యై తపోలక్ష్మ్యై నమోనమః | నమః సత్య లోకలక్ష్మ్యై *మహాలక్ష్మ్యై నమోనమఃIl* భావలక్ష్మ్యై వృద్ధిలక్ష్మ్యై భవ్యలక్ష్మ్యై నమోనమః | నమస్తే వైకుంఠలక్ష్మ్యై *మహాలక్ష్మ్యై నమోనమఃIl* నిత్యలక్ష్మై సత్యలక్ష్మై వంశలక్ష్మ్యై నమోనమః | నమస్తే కైలాసలక్ష్మ్యై *మహాలక్ష్మ్యై నమోనమఃIl*