Sri Lalitha Sahasra Nama Stotram
Статистика- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 1
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- te
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 52
- 1/48двое суток
- 59
- 1/72трое суток
- 64
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
без подписи
без подписи
🕉️ 13 ఆగష్టు 2026 🕉️ 🚩శ్రావణ మాస ప్రారంభం🚩 గురువారం గ్రహబలం పంచాంగం గురువారం గ్రహాధిపతి గురువు (బృహస్పతి). గురువు యొక్క అధిష్టాన దైవం "శ్రీ ఇంద్రుడు" మరియు "శ్రీ దక్షిణామూర్తి". గురువు అనుగ్రహం కొరకు గురువారం నాడు స్మరించవలసిన మంత్రాలు: 1. ఓం బృహస్పతయే నమః || 2. ఓం ఇంద్రాయ నమః || 3. ఓం దక్షిణామూర్తయే నమః || 4. ఓం విష్ణవే నమః || 5. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః || శ్రీ దక్షిణామూర్తి శివాలయంలోని దక్షిణ గోడలో కొలువై వుంటారు. గురువు అనుగ్రహం కొరకు గురువారాల్లో శివాలయం సందర్శించండి. దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. గురువారాల్లో శివాలయంతో పాటు, శ్రీ మహా విష్ణు, శ్రీ దత్తాత్రేయ, మరియు శ్రీ సాయిబాబా ఆలయాలు కూడా దర్శించండి. గురువారం జ్ఞానం, భక్తి, ధ్యానం, డబ్బు వ్యవహారాలు, వివాహ ప్రయత్నాలు, దాతృత్వం చేయడం, పిల్లల పనులు, అమ్మకాలు, కొనుగోళ్లు, పెద్దలను కలవడం వంటి పనులకు చాలా అనుకూలం. అత్యాశ, హింస, కోపం, అబద్ధాలు చెప్పడం, సోమరితనం వంటి వాటికీ దూరంగా వుండండి. గ్రహ బలం కొరకు, గురువారం పసుపు మరియు బంగారం రంగు దుస్తులు ధరించండి. గురువారం గోళ్లు కత్తిరిస్తే జ్ఞానప్రాప్తి కలుగుతుంది. అమృత కాలం: 02:21 AM – 03:51 AM దుర్ముహూర్తం: 10:16 AM – 11:05 AM, 03:15 PM – 04:05 PM వర్జ్యం: 05:22 PM – 06:52 PM 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ శ్రీ పరాభవ నామ సంవత్సరం, శ్రావణ మాసం, శుక్ల పక్షం, తిథి: పాడ్యమి: Aug 12 11:06 PM to Aug 13 08:41 PM విదియ: Aug 13 08:41 PM to Aug 14 06:47 PM పాడ్యమి ఆనందాన్ని ప్రసాదించే నంద తిథి. పాడ్యమి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పండుగలు, ప్రయాణాలు, వివాహం, ప్రతిష్టాపన, ప్రతిజ్ఞ పాటించడం, పదవిని స్వీకరించడం మరియు రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన పనులకు శుభప్రదం. పాడ్యమి రోజు "అగ్ని దేవుడిని" ఆరాధించడం వలన శుభ ఫలితాలు లభిస్తుంది. 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ నక్షత్రం: ఆశ్లేష: Aug 12 07:59 AM to Aug 13 06:06 AM మాఘ: Aug 13 06:06 AM to Aug 14 04:38 AM పూర్వఫల్గుణి: Aug 14 04:38 AM to Aug 15 03:42 AM మఖ (మఘ) నక్షత్రానికి అధిపతి "కేతువు". అధిష్టాన దేవతలు "పితృ". (పితృ దేవతలు). ఇది భయంకరమైన మరియు క్రూరమైన స్వభావం గల నక్షత్రం. మఖ నక్షత్రం ఉన్నరోజు స్మరించవలసిన మంత్రాలు: 1. ఓం కేతవే నమః || 2. ఓం పితృభ్యో నమః || మఖ నక్షత్రం ఉన్నరోజు మోసం. సంఘర్షణ, శత్రువుల నాశనము, నిర్బంధం, రసాయన ప్రయోగం, అగ్నితో చేసే కార్యక్రమాలు, నిప్పు పెట్టడం, అపఖ్యాతి పనులు, క్రూరత్వం వంటి చర్యలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు, శుభకార్యాలకు అనుకూలం కాదు. రుణాలు ఇవ్వవద్దు లేదా తీసుకోవద్దు. 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ రేపటి "గ్రహ బలం పంచాంగాన్ని" ప్రతి రోజు సాయంత్రం మీ ఫోనుకు నేరుగా అందుకోవడానికి, క్రింది లింక్ పై టచ్ చేసి, "Graha Balam Stotras" టెలిగ్రామ్ ఛానల్ లో ఉచిత సభ్యులుగా చేరండి: https://t.me/GrahaBalamStotras 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ మీకు సాధ్యమైనప్పుడల్లా అనాధలకు, జంతువులకు, పక్షులకు ఆహారాన్ని, త్రాగు నీటిని అందించండి. ఇలా చేయడం వలన లభించే పుణ్య బలం తో జాతక రీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో కష్టాలు మీకు తెలియకుండానే తొలగిపోతుంది. చెట్లను నాటి, వాటిని సంరక్షించడాన్ని శివ పురాణం "స్థావర లింగ పూజ" గా వర్ణించింది. కాబట్టి మీరు చెట్లను నాటి వాటిని సంరక్షించారంటే, పర్యావరణాన్ని కాపాడడం తో పాటు విశేష దైవానుగ్రహాన్ని కూడా పొందవచ్చు. ఈ పంచాంగం సందేశాన్ని మీరు చదివిన తరువాత, మీ వాట్సాప్, మరియు టెలిగ్రామ్ లోని బంధుమిత్రులకు, గ్రూప్స్ కు కూడా పంపండి. ధన్యవాదాలు, నమస్తే! లోకాః సమస్తాః సుఖినో భవంతు || శుభం భూయాత్ || 🙏
без подписи
без подписи
అన్ని రాశులకు స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సర 2026-27 రాశి ఫలితాలు - పరిహారాలు! 🙏👇
🕉️ పితృ పక్షాలు Part 2 🕉️ పితృ దేవతలను శాంతింపచేసి వారి అనుగ్రహం పొందడానికి Part 1 పోస్ట్ లో తెలిపిన శ్లోకాలను పఠించడం తో పాటు ఈ Part 2 పోస్ట్ లో క్రింద తెలిపిన ఇతర పరిహారాలను కూడా మీకు సాధ్యమయిన రీతిలో ఆచరించండి: ✅ పితృ శాంతి అన్న దానం: ✅ జ్యోతిర్లింగము, శక్తి పీఠము ఒకే చోట కొలువైవున్న శ్రీశైల మహా క్షేత్రం లో ఒక వ్యక్తికి అన్నదానం చేయడం వలన, వెయ్యి ఏనుగులను, కోటి గోమాతలను, అపరిమితమైన బంగారాన్ని, భూమిని దానం చేసినదానికన్నా ఎక్కువ ఫలితం లభిస్తుంది అని శాస్త్రాలలో చెప్పబడింది. ఇంతటి విశిష్టమైన దాన ఫలితం మీ పితృ దేవతలకు లభించి వారు మోక్షం పొందటం కొరకు పితృ పక్షాలలో శ్రీశైల దేవస్థాన అన్నదాన సత్రంలో అన్న ప్రసాద వితరణ కొరకు విరాళాలు పంపండి. శ్రీశైల దేవస్థాన అన్నదాన సత్రంలో అన్న ప్రసాద వితరణ కొరకు రూ.100/- అంతకన్నా ఎక్కువగా చెల్లించడానికి మీరు శ్రీశైల దేవస్థాన అధీకృత వెబ్సైటు కు వెళ్లి, మీ ఫోన్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేయించుకుని, ఇంటర్నెట్ పేమెంట్ ద్వారా చెల్లించండి. శ్రీశైల దేవస్థాన అధీకృత వెబ్సైటు లింక్ క్రింద ఇచ్చాము. వెబ్ పేజీ క్రింద వున్న "Donate Now" బటన్ పై టచ్ చేసి మీరు ఎంత మొత్తం చెల్లించాలనుకుంటే అంత మొత్తం చెల్లించండి. https://www.srisailadevasthanam.org/en-in/donations/sbms-one-day-annaprasadam 🛕మీరు తిరుమల తిరుపతి దేవస్థానం లో జరిగే నిత్య అన్నప్రసాద వితరణ కు కూడా క్రింది లింక్ ను ఓపెన్ చేసి రూ.100/- అంతకన్నా ఎక్కువగామీకు తోచినంత విరాళాలు పంపవచ్చు. https://tirupatibalaji.ap.gov.in/#/edonation ✅ పితృ శాంతి నీటి సమర్పణ: ✅ పితృ పక్షాలలో ఈ 15 రోజులు అపరాన్న వేళలో అంటే మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల మధ్య మీ పితృ దేవతలు వారి వంశస్థులను చూసి వెళ్ళడానికి భూమి మీదకు వచ్చి మీ ఇంటి చుట్టుపక్కలే తిరుగుతారు. కావున అపరాన్న వేళలో మీ ఇంటి ప్రధాన గుమ్మం వెలుపల, ఒక కుర్చీ లేదా స్టూల్ వేసి, దానిపై ఒక రాగి పాత్ర లో, మట్టి పాత్ర లో లేదా ఏదైనా ఇతర పాత్ర లో పితృ దేవతల కొరకు నీటిని నింపి పెట్టండి. పితృ దేవతలు సంతృప్తి చెంది మిమ్మల్ని అనుగ్రహించి వెళ్ళిపోతారు. ✅ పితృ శాంతి ఆహార వితరణ: ✅ పితృ పక్ష కాలంలో ఆవులు, వీధి శునకాలు (కుక్కలు), కాకులు, పక్షులు, చీమలు, మరియు ఇతర జీవాలకు ఆహారాన్ని అందించడం వలన కూడా పితృ శాంతి కలుగుతుందని చెప్పబడింది. ఈ పక్షం రోజులలో మీ ఇంటి వద్దకు వచ్చి బిక్ష కోరే వ్యక్తులకు ఆహరం లేదా భోజనం అందించి వారిని సంతృప్తి పరచడం వలన కూడా పితృ శాంతి కలుగుతుంది. కావున ఈ పితృ పక్షాలలో మీ శక్తి కొద్దీ మీ ఇంటి వద్దకు వచ్చే జంతువులకు, యాచకులకు ఆహారాన్ని అందించి పితృ దేవతల అనుగ్రహాన్ని పొందండి. పితృ పక్షాలలో ఆచరించాల్సినటువంటి పితృ శాంతి పరిహారాల సందేశాన్ని మీరు చదివిన తరువాత, మీ వాట్సాప్, మరియు టెలిగ్రామ్ లోని బంధుమిత్రులకు, గ్రూప్స్ కు కూడా పంపండి. ధన్యవాదాలు, నమస్తే! 🕉️ ఇటువంటి విలువైన సమాచారం నేరుగా అందుకోవడానికి ఈ ఉచిత టెలిగ్రామ్ ఛానల్ లో ఇప్పుడే చేరండి: https://t.me/GrahaBalamStotras లోకాః సమస్తాః సుఖినో భవంతు || శుభం భూయాత్ || 🙏
🕉️ పితృ పక్షాలు Part 1🕉️ 🌗 మహాలయ పక్షం లేదా పితృ పక్షం అని పిలువబడే 15 రోజుల కాలం సెప్టెంబర్ 7న ప్రారంభమై సెప్టెంబర్ 21న మహాలయ అమావాస్యతో ముగుస్తుంది. పూర్వీకులను స్మరించుకోవడం వారికి నివాళి అర్పించి ఆశీస్సులు పొందడం ఈ పితృ పక్షం ముఖ్య ఉద్దేశం. ⚠️పితృ దోషం: ⚠️ మీ కుటుంబం లేదా మీ వంశంలోని పితృ దేవతలు (మరణించిన పెద్దలు) ఏ కారణం చేత అయినా అసంతృప్తితో ఉంటే, పితృ దోషం కలిగి, కుటుంబ సభ్యులకు అనారోగ్యాలు, కుటుంబంలో అశాంతి, సరియైన ఉపాధి లేకపోవడం, ఉద్యోగాలు కోల్పోవడం, వ్యాపారాలు మూతబడటం, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో వివాహాలు కాక పోవడం, వివాహమైన వారికీ సంతానం కలుగక పోవడం, కుటుంబ అభివృద్ధి లోపించడం వంటి పరిస్థితులు ఏర్పడుతుంది. ❌ పితృ దేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించక పోవడం, పితృ పూజలు చేయకపోవడం, పితృ తర్పణాలు, దానాలు వంటివి చేయకపోవడం వలన పితృ దోషం కలుగుతుంది. 🙏పితృ శాంతి: 🙏 ఏ కారణం చేత ఐన శ్రాద్ధ కర్మలు, తర్పణాలు, దానాలు వంటివి చేయకపోయినా, చేయడం వీలు కాకపోయినా, ఈ పితృ పక్షాలలో క్రింద తెలిపిన సులభ పరిహారాలను ఆచరించి, పితృ దేవతల అనుగ్రహాన్ని పొంది పితృ దోష దుష్ప్రభావాలను తొలగించుకోండి. ✅ పితృ శాంతి పారాయణ: ✅ పితృ దేవతలను శాంతింపచేసి వారి అనుగ్రహం పొందడానికి క్రింది శ్లోకాలను భక్తి శ్రద్దలతో, పూర్తి విస్వాసంతో పఠించండి: @@@@ 🚩పితృ దేవతలకు మోక్షాన్ని ప్రసాదించే శ్రీ మహా విష్ణు ప్రార్థన: 🙏 నమస్తే పుండరీకాక్ష, రుణ త్రాయ విమోచన, | లక్ష్మీకాంత నమస్తేస్తు నమస్తే, పితృ మోక్షదః || (ఈ ప్రార్థన శ్లోకాన్ని పితృ పక్షాలలో ప్రతి రోజు 11సార్లు పఠించండి) @@@@@ 🚩పితృ దేవతలను నమస్కరించుకునే మంత్రం: 🙏 ఓం పితృభ్యో నమః || @@@@@ 🚩బ్రహ్మ కృత పితృ ప్రణామ స్తవం: 🙏 నమః పిత్రే జన్మదాత్రే సర్వ దేవమయాయ ఛ ! సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే !! సర్వయఙ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే ! సర్వతీర్ధావలోకాయ కరుణాసాగారాయ చ !! నమః సదా ఆశుతోషాయ శివ రూపాయ తే నమః ! సదాపరాధ క్షమిణే సుఖాయ సుఖదాయ చ !! దుర్లభం మానుషమిదం యేన లబ్ధం మయా వపుః ! సంభావనీయం ధర్మార్దే తస్మై పిత్రే నమో నమః !! తీర్ధస్నాన తపో హోమ జపాదీన్ యస్య దర్శనం ! మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః !! యస్య ప్రణామ స్తవనాత్ కోటిశః పితృ తర్పణం ! అశ్వమేధ శతైస్తుల్యం తస్మై పిత్రే నమో నమః !! (పితృ పక్షాలలో శ్రాద్ధ కర్మలు, పితృ పూజలు, పితృ తర్పణాలు వంటివి చేయలేకపోతున్నందుకు మిమ్మల్ని మన్నించి, మిమ్మల్ని అనుగ్రహించవలసిందిగా మనస్సులో సంకల్పం చెప్పుకుని, పితృ పక్షాలు పూర్తయ్యేంతవరకు ప్రతి మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల మధ్య, పై మంత్రాన్ని 11 సార్లు, పై స్తవాన్ని కనీసం 3 సార్లు పఠించి, మీ ఇంటి ప్రధాన గుమ్మం వెలుపల కు వచ్చి, అక్కడ పితృ దేవతలు ఉన్నారన్న భావనతో వారికి నమస్కరించండి). పితృ పక్షాలలో పితృ శాంతి కొరకు ఆచరించాల్సిన ఇతర పరిహారాలను Part 2 గా పంపుతున్నాము. 🕉️ ఇటువంటి విలువైన సమాచారం నేరుగా అందుకోవడానికి ఈ ఉచిత టెలిగ్రామ్ ఛానల్ లో ఇప్పుడే చేరండి: https://t.me/GrahaBalamStotras పితృ పక్షాలలో ఆచరించాల్సినటువంటి పితృ శాంతి పరిహారాల సందేశాన్ని మీరు చదివిన తరువాత, మీ వాట్సాప్, మరియు టెలిగ్రామ్ లోని బంధుమిత్రులకు, గ్రూప్స్ కు కూడా పంపండి. ధన్యవాదాలు! Contd...Part..2...
🌒 ఈ రోజు అనగా 7.09.2025 వతేది భాద్రపద శుక్ల పౌర్ణమి ఆదివారం రాత్రి 9 గంటల 57 నిమిషాల నుండి రాత్రి 01-27 నిమిషాల వరకు ఏర్పడుతున్న సంపూర్ణ చంద్ర గ్రహణ పుణ్య కాలంలో క్రింద ఇస్తున్న సూర్య, చంద్ర, రాహు గ్రహాల యొక్క స్తోత్రము మరియు వేద మంత్రాలను అన్ని రాశుల వారు గ్రహణ పుణ్య కాలంలో పఠించడం వలన ధైర్యము, శక్తి సామర్థ్యాలు, శత్రువులపై విజయం, కీర్తి ప్రతిష్టలు, మంచి ఆరోగ్యము, క్లిష్టమైన పనులలో విజయం, దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం, మానసిక శాంతి, మంచి సౌందర్యము, ముఖ వర్చస్సు, అందరూ మెచ్చుకునే వ్యక్తిత్వము, భావోద్వేగాలపై నియంత్రణ, సంపదలు, కీర్తి ప్రతిష్టలు, క్లిష్టమైన పనులలో విజయం, మంచి మానసిక ఆరోగ్యము, దీర్ఘాయువు, ఆర్ధిక విజయాలు, ఉపాధి రంగంలో స్థిరత్వము, ఆదాయ మార్గాల పెరుగుదల, స్పెక్యులేషన్ వ్యాపారాలలో లాభాలు, మంచి శక్తి సామర్థ్యాలు, అనేక విషయాలపై లోతైన అవగాహన, అధిక సామాజిక ఖ్యాతి వంటి విశేష ఫలితాలు లభిస్తుంది. ⭕ ప్రత్యేకించి కర్కాటక రాశి, వృశ్చిక రాశి, కుంభ రాశి, మీన రాశి మరియు విశాఖ నక్షత్రం, తులా రాశి వారు గ్రహణ పుణ్య కాలం లో ఈ మంత్రాలను పఠించడం వలన గ్రహణం కారణంగా వీరు ఎదుర్కోవాల్సిన ప్రతికూల ఫలితాల నుండి మంచి ఉపశమనం లభిస్తుంది. ✅ అన్ని రాసుల వారు క్రింది మంత్రాలను గ్రహణ పుణ్య కాలంలో పారాయణ చేస్తే చాలు. ☑️ కానీ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, కుంభ రాశి, మీన రాశి మరియు విశాఖ నక్షత్రం, తులా రాశి వారు మాత్రం ఈ మంత్రాలను సోమవారం 15 సెప్టెంబర్ వరకు ప్రతి రోజు పఠించి గ్రహణ ప్రతికూల ఫలితాలను పూర్తిగా తొలగించుకోవచ్చు. 🕉️ సూర్య స్తోత్రాన్ని 6 సార్లు, చంద్ర స్తోత్రాన్ని 10 సార్లు, రాహు స్తోత్రాన్ని 18 సార్లు పఠించాలి. అదేవిధంగా సూర్య వేద మంత్రాన్ని 6 సార్లు, చంద్ర వేద మంత్రాన్ని10 సార్లు, రాహు వేద మంత్రాన్ని 18 సార్లు పఠించాలి. 🔊 🎼 🎶 మీరు మంత్రాలను ఎన్ని సార్లు పఠించాలో మంత్రాల క్రింద ఇచ్చిన ఆడియో ఫైల్ లో అన్ని సార్లు మంత్రం ప్లే అవుతుంది. మీరు మంత్రం ఆడియో ప్లే చేసి, మంత్రం యొక్క లిరిక్స్ ను చదువుతూ ఆడియో ఫైల్ తో పాటు పారాయణ చేస్తే చాలు: ముఖ్య గమనిక: సూర్య, చంద్ర మరియు రాహు స్తోత్రం మరియు మంత్రం యొక్క ఆడియో ఫైల్స్ మరియు తెలుగు లిరిక్స్ అన్నీ వివరంగా మన "Graha Balam Stotras" టెలిగ్రామ్ ఛానల్ లో ఇవ్వడం జరిగింది. మీరు దయచేసి మంత్రం పఠనం కొరకు "Graha Balam Stotras" టెలిగ్రామ్ ఛానల్ ను చూడండి: https://t.me/GrahaBalamStotras 🙏
🌒 సంపూర్ణ చంద్ర గ్రహణం - 7/9/2025 🌗 🚩 దృగ్గణితాన్ని ప్రమాణంగా తీసుకుని, గ్రహణ గోచార శాస్త్రం ప్రకారం అన్ని రాశుల వారికి చంద్ర గ్రహణ ఫలితాలు, పరిహారాలు అందిస్తున్నాము 🚩 07.09.2025 వతేది భాద్రపద శుక్ల పౌర్ణమి ఆదివారం రోజున రాహు గ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. 🕉️ గ్రహణం ప్రారంభ కాలం (స్పర్శ కాలం): రాత్రి 9 గంటల 57 ని.లకు గ్రహణ మధ్య కాలం: రాత్రి 11.32 ని. గ్రహణ మోక్ష కాలం: రాత్రి 01-27 ని. ఆద్యంతం మొత్తం గ్రహణ పుణ్యకాలం: 3. 10 ని. ✅ ఈ చంద్ర గ్రహణం మేష రాశి, వృషభ రాశి, కన్య రాశి, మరియు ధనుస్సు రాశుల వారికీ అనుకూలంగా ఉన్నందున, ఈ నాలుగు రాశుల వారు ఎటువంటి పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు. ☑️ ఈ చంద్ర గ్రహణం మిథున రాశి, సింహ రాశి, తులా రాశి, మరియు మకర రాశుల వారికీ మధ్యస్థంగా ఉన్నందున, ఈ నాలుగు రాశుల వారికీ అనుకూల లేదా ప్రతికూల ఫలితాలు ఏవి ఉండదు. కాకపోతే, విశాఖ నక్షత్రం, తులా రాశి వారు మాత్రం క్రింద తెలిపిన పరిహారాలు చేయాలి. ❌ ఈ చంద్ర గ్రహణం కర్కాటక రాశి, వృశ్చిక రాశి, కుంభ రాశి, మరియు మీన రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఇస్తుంది. గ్రహణ ప్రతికూల ప్రభావం 6 నెలల పాటు ఉంటుంది కాబట్టి ఈ 4 రాసుల వారు జనవరి 2026 పూర్తి అయ్యేవరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ⚠️ ఈ నాలుగు రాశుల వారు ప్రమాదాలు, అనారోగ్యాలు, పనులలో ఆటంకాలు, ఉద్యోగ వ్యాపార నష్టాలు, తల్లితో లేదా తల్లి తరపు వారితో విభేదాలు, మానసిక ఆందోళన, మనశ్శాంతి లేకపోవడం వంటి ప్రతికూల ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా క్రింది పరిహారాలు చేసుకోవాలి. 🕉️ అన్ని రాశుల వారు గ్రహణం ప్రారంభం అయిన వెంటనే అంటే రాత్రి 9 గంటల 57 ని.లకు స్నానం చేసి గ్రహణ కాలంలో శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం, శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం, శ్రీ దుర్గా సప్తశతీ లేదా వారికి నచ్చే ఇతర స్తోత్రాలు మంత్రాలు పఠించాలి. ఈ స్తోత్రాలను ఆడియో వింటూ, తెలుగు లో స్తోత్ర సాహిత్యాన్ని చదువుతూ పఠించడానికి గ్రహ బలం stotras ఉచిత టెలిగ్రామ్ ఛానల్ లో ఇప్పుడే చేరండి: https://t.me/GrahaBalamStotras ⭕ ప్రత్యేకించి కర్కాటక రాశి, వృశ్చిక రాశి, కుంభ రాశి, మీన రాశి మరియు విశాఖ నక్షత్రం, తులా రాశి వారు గ్రహణ పుణ్య కాలం లో పైన తెలిపిన స్తోత్రాలతో పాటు గ్రహణ ప్రతికూల ప్రభావాలు తొలగిపోవడానికి క్రింది శ్లోకాలను 3 సార్లు లేదా 11 సార్లు పఠించండి. 🕉️ గ్రహణ దోష పరిహార శ్లోకం: 🕉️ ఇంద్ర నలో దణ్ణధరశ్చ రక్షః ప్రాచేత సో వాయు కుబేర శర్వాః | మజ్జన్మ ఋక్షే మమ రాశి సంస్థే చంద్రోపరాగం శమయంతు సర్వే || 🚩 గ్రహణ దోష పరిహార స్తోత్రం: 🚩 యోసౌ వజ్రధరో దేవః ఆదిత్యానాం ప్రభుర్మతః | సహస్ర నయన శ్శక్రః గ్రహపీడాం వ్యపోహతు || ముఖం య స్సర్వ దేవానాం సప్తార్చి రమిత ద్యుతిః | చంద్ర సూర్యో పరాగోత్థాం గ్రహపీడాం వ్యపోహతు || యః కర్మసాక్షీ లోకానాం యమో మహిష వాహనః | చంద్ర సూర్యో పరాగోత్థాం గ్రహపీడాం వ్యపోహతు || రక్షో గణాధిప స్సాక్షాత్ ప్రలయానల సన్నిభః | ఉగ్రః కరాళో నిరతిః గ్రహపీడాం వ్యపోహతు || నాగపాశ ధరో దేవో నిత్యం మకరవాహనః | వరుణో జలలోకేశః గ్రహపీడాం వ్యపోహతు || ప్రాణరూపో హి లోకానాం వాయుః కృష్ణ మృగప్రియః | చంద్ర సూర్యోపరాగోత్థాం గ్రహపీడాం వ్యపోహతు || యోసౌ నిధిపతిర్ దేవః ఖడ్గశూల ధరో వరః | చంద్ర సూర్యోపరాగోత్థాం కలుషం మే వ్యపోహతు || యో౬సౌ శూలధరో రుద్రః శంకరో వృషవాహనః | చంద్ర సూర్యో పరాగోత్థాం దోషం నాశయతు ద్రుతమ్ || 🕉️ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, కుంభ రాశి, మీన రాశి మరియు విశాఖ నక్షత్రం, తులా రాశి వారు గ్రహణ ప్రతికూల ప్రభావాలు తొలగిపోవడానికి 8/9/2025 వ తేదీ సోమవారం ఒక తెలుపు రంగు కాటన్ తువ్వాలు లో 1 కేజీ 250 గ్రాముల సన్న బియ్యం వేసి మూట కట్టుకోవాలి, ఒక ముదురు నీలం రంగు కాటన్ తువ్వాలు లో 1 కేజీ 250 గ్రాముల నల్ల మినుములు వేసి మూట కట్టుకోవాలి. వీటితోపాటు ఒక నెయ్యి ప్యాకెట్, దొరికే అవకాశం ఉంటే వెండి లేదా రాగి తో చేసినటువంటి ఒక నాగ పడిగ, ఒక చంద్ర బింబం (ఈ చిన్న ఆకృతులు పూజ సామాగ్రి అమ్మే దుకాణాలలో దొరుకుతుంది), తమలపాకులు, వక్కలు, రూ.21/- లేదా అంతకన్నా ఎక్కువగా మీకు తోచినంత దక్షిణ పెట్టి ఈ వస్తువులు అన్నింటినీ శివాలయాల్లో నిత్య పూజలు చేసి అనుభవజ్ఞులైన అర్చక స్వామికి దానం చేసి, వారి పాదాలకు నమస్కరించాలి. 8 వ తేదీ కుదరక పోతే వీలైనంత తొందరగా ఈ దానం ఇవ్వాలి. దానం ఇవ్వలేని వారు శివాలయం వెళ్లి, రూ. 11/- హుండీ లో సమర్పించి, గ్రహణ ప్రతికూల ప్రభావాలు తొలగిపోవాలని ప్రార్ధించి, "ఓం నమః శివాయ" మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు జపించాలి. ఈ గ్రహణ ఫలితాలు, పరిహారాల సందేశాన్ని మీరు చదివిన తరువాత, మీ వాట్సాప్, మరియు టెలిగ్రామ్ లోని బంధుమిత్రులకు, గ్రూప్స్ కు కూడా పంపండి. ధన్యవాదాలు, నమస్తే! లోకాః సమస్తాః సుఖినో భవంతు || శుభం భూయాత్ || 🙏
🙏 పంచదశి మంత్రం క - ఏ - ఈ - ల - హ్రీం హ - స - క - హ - ల - హ్రీం స - క - ల - హ్రీం क - ए - ई - ल - ह्रीं ह - स - क - ह - ल - ह्रीं स - क - ल - ह्रीं పంచదశి మంత్రం శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారి ప్రధాన బీజ మంత్రం. ఈ పంచదశి మంత్రాన్ని 108 సార్లు జపం చేసి, తరువాత శ్రీ లలిత సహస్ర నామ స్తోత్రాన్ని పఠిస్తే, చాలా త్వరగా అమ్మ వారి అనుగ్రహం లభిస్తుందని బ్రహ్మాండ పురాణం లోని ఉత్తర ఖండంలో, శ్రీ హయగ్రీవ స్వామి వారు శ్రీ అగస్త్య మునివర్యులతో చెప్పినట్లు మనకు శ్రీ వ్యాస భగవానులవారు తెలుపుతున్నారు. మీరు ఈ పంచదశి మంత్రాన్ని పఠిస్తే, మీకు శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారి అనుగ్రహంతోపాటు, ఈ బీజాక్షరాలలో కొలువై వున్న అనేక దేవత శక్తుల అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ పంచదశి మంత్రంలో క్రింద తెలిపిన ప్రకారం ప్రతి ఒక్క "బీజ" అక్షరం ఒక ప్రత్యేకమైన అనుగ్రహాన్ని మీకు ప్రసాదిస్తుంది. మీరు పంచదశి మంత్రాన్ని మనస్సులో పఠిస్తుంటే : "క" బీజం ద్వారా శ్రీ బ్రహ్మ దేవుని అనుగ్రహంతో శాంతి, సౌభాగ్యం, అభివృద్ధిని మీ జీవితంలో పొందుతారు. "ఏ" బీజం ద్వారా శ్రీ సరస్వతి దేవి అనుగ్రహంతో మీ దురదృష్టాలన్నింటిని తొలగించుకుని సౌభాగ్యం, శుభము, జ్ఞానమును మీ జీవితంలో పొందుతారు. "ఈ" బీజం ద్వారా శ్రీ మహాలక్ష్మి దేవిఅనుగ్రహం తో సిరి సంపదలను, అపార ఐశ్వర్యాన్ని, సౌభాగ్యాన్ని మీ జీవితంలో పొందుతారు. "ల" బీజం ద్వారా శ్రీ ఇంద్ర దేవుని అనుగ్రహంతో మీరు కార్య సిద్ధిని, సర్వత్రా గెలుపుని, తిరుగులేని విజయాలను మీ జీవితంలోని అన్ని విషయాలలో స్వంతం చేసుకుంటారు. మాయ బీజమైన "హ్రీం" బీజము, శివ స్వరూపమైన "హ" బీజము, విష్ణు స్వరూపమైన "స" బీజము మీకు అభ్యుదయాన్ని, శ్రేయస్సును, దృఢత్వమును, సుస్థితిని, సుఖ సంతోషాలను, అనేక యోగ్యతలను, ఆధ్యాత్మిక భావనలను చివరకు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. మీరు మొదటి సారి పంచదశి మంత్రాన్ని పఠించే ముందు,ఆదిగురువైన ఆ సదాశివున్ని గురువుగా భావించి, పంచదశి మంత్రాన్ని పఠించడానికి మీకు అనుమతిని, ఉపదేశాన్ని, అనుగ్రహాన్ని ప్రసాదించవలసిందిగా సదాశివున్ని వేడుకుని, తరువాత మంత్ర పఠనం ప్రారంభించండి. పైన అందించిన ఆడియో ఫైల్, మీరు మనస్సులో ఏ విధంగా మంత్ర పఠనం చేయాలో, మీ మనస్సులో ఈ మంత్రాన్ని ఎలా పలకాలో తెలుపుతుంది. మీకు పైన అందించిన ఆడియో ఫైల్ లో, ఈ పంచదశి మంత్రం 108 సార్లు వస్తుంది. ఆడియో ప్లే చేసి ఈ ఫైల్ పూర్తి అయ్యేంతవరకు ఆడియోతో పాటు మీరు ఈ మంత్రాన్ని మనస్సులో పఠిస్తే, మీరు మొత్తం 108 సార్లు ఈ మంత్రం జపాన్ని పూర్తి చేస్తారు. 🙏 బీజాక్షర మంత్రాలను గట్టిగా పైకి పలుక కూడదు. మీరు బీజాక్షర మంత్రాలను మనస్సులోనే ధ్యానం చేసుకోవాలి. మీరు ఈ మంత్రాన్ని పఠించేటప్పుడు తూర్పు దిక్కును కాని ఉత్తర దిక్కును కానీ చూస్తూ కూర్చొని పఠించండి 🙏 మీరు పంచదశి బీజ మంత్రాన్ని (అలాగే ఇతర అన్ని మంత్రాలను, స్తోత్రాలను కూడా) భక్తి శ్రద్దలతో, పూర్తి నమ్మకంతో, ఒక ఆనంద పారవశ్యముతో పఠించాలి. మంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఆ అనుభవాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ, తన్మయత్వంతో మంత్ర పఠనం చేయాలి. అలా కాకుండా, యాంత్రికంగా ఎప్పుడెప్పుడు 108 పూర్తి అయిపోతుందా అన్నట్లు చేయకూడదు. మీరు పంచదశి మంత్రాన్ని పఠిస్తున్నప్పుడు మీ స్పృహ, బుద్ధి, చైతన్యం, మనస్సు, సమస్తం మంత్ర శక్తిపైనే ఉండాలి. మీరు పంచదశి మంత్రాన్ని పఠిస్తున్నప్పుడు, శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారి అనుగ్రహంతోపాటు, మంత్రంలోని బీజాక్షరాలలో కొలువై వున్న అన్ని దేవత శక్తుల అనుగ్రహం కూడా మీకు సమృద్ధిగా లభిస్తున్న భావనతో, మంత్ర శక్తితో మీ జీవితం అన్ని విధాలుగా అభివృద్ధి చెందబోతోంది అన్న విశ్వాసంతో మీరు మంత్ర పఠనం చేయాలి. t.me/SriLalithambika 🙏🙏
без подписи
без подписи
|| ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణే, ఉత్తర ఖండే, శ్రీ హయగ్రీవ - అగస్త్య సంవాదే, శ్రీ లలితా సహస్ర నామ స్తోత్ర కథనం, సంపూర్ణం.... ||
శ్రీ శివా, శివ శక్త్యైక్య రూపిణీ, లలితాంబికా | (998 - 1000) ఏవం శ్రీ లలితా దేవ్యా నామ్ నామ్ సాహస్రకం జగుః || 183 ||
ఆబాల గోప విదితా, సర్వానుల్లంఘ్య శాసనా | శ్రీ చక్ర రాజ నిలయా, శ్రీమత్త్రిపుర సుందరీ || 182 || (994 - 997)
అభ్యాసాతి శయఙ్ఞాతా, షడధ్వా తీత రూపిణీ | అవ్యాజ కరుణా మూర్తిః, అఙ్ఞాన ధ్వాంత దీపికా || 181 || (990 - 993)
యోని ముద్రా, త్రిఖండేశీ, త్రిగుణా, అంబా, త్రికోణగా | అనఘా, అద్భుత చారిత్రా, వాంఛి తార్థ ప్రదాయినీ || 180 || (ఈ శ్లోకంలోని 984 మరియు 985 వ నామాన్ని కలిపి"త్రిగుణాంబా" అని పలికినా అవి రెండూ వేరు వేరు నామాలు అని గుర్తించి పలకాలి). (982 - 989) [Audio ends @ 29.16 minutes]
దశముద్రా సమా రాధ్యా, త్రిపురా శ్రీ వశంకరీ | ఙ్ఞాన ముద్రా, ఙ్ఞాన గమ్యా, ఙ్ఞాన ఙ్ఞేయ స్వరూపిణీ || 179 || (977 - 981)
సువాసిన్యర్చన ప్రీతా, ఆశోభనా, శుద్ధ మానసా | బిందు తర్పణ సంతుష్టా, పూర్వజా, త్రిపురాంబికా || 178 || (ఈ శ్లోకంలోని 972వ నామాన్ని "ఆశోభనా" అని "ఆ"తో కలిపి పలకాలి. 96వ శ్లోకంలోని 462వ నామం "శోభనా" వేరు ఈ నామం వేరు). (971 - 976)