Tirumala updates & information...
СтатистикаThis is a private group about Tirumala Tirupati devasthanam information & details... This is not a official We just giving information to the For devotees .
- Последний пост
- 18:55
- Последнее чтение
- ещё не заходили
- Постов за неделю
- 11
- Всего постов
- 26
- Тип
- открытый
- Язык
- английский
- Категория
- Новости и СМИ (по похожим)
- В каталоге с
- 15 авг.
- 1/24сутки в ленте
- 683
- 1/48двое суток
- 782
- 1/72трое суток
- 844
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
Tirumala Garuda 🦅 Panchami Garuda seva
Present update.... Devotees opting for free darshan without tokens will take *24 to 30 hours*.
*తిరుమల సమాచారం* *15-ఆగస్టు-2026* *శనివారం* 🕉️ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. 🕉️ వైకుంఠంలోని *31* కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు 🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు *18-20* గంటల సమయం. 🕉️ టైమ్ స్లాట్ (SSD) టోకన్ దర్శనానికి *3-8* గంటలు 🕉️ రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు *2-6* గంటల సమయం 🕉️ నిన్న *14-08-2026* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *73,699* మంది... 🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *39,884* మంది... 🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం *4.03* కోట్లు ... *🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*
*పలమనేరులో వైభవంగా శ్రీ మహాలక్ష్మీ దీప పూజ* *దీపం ఇంటికే కాదు.. సమాజానికీ వెలుగునిస్తుంది: జేఈవో డా. ఏ. శరత్* *మహాలక్ష్మీ దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉంది: ఎమ్మెల్యే శ్రీ ఎన్. అమర్నాథ్ రెడ్డి* *భక్తిశ్రద్ధలతో పాల్గొన్న వేలాది మంది మహిళలు* తిరుపతి, 2026 ఆగస్టు 14:: పలమనేరులోని ఎస్వీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం టీటీడీ, ఎస్వీబీసీ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మీ దీప పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. పలమనేరు, పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది మహిళా భక్తులు తరలివచ్చి భక్తిశ్రద్ధలతో దీప పూజలో పాల్గొన్నారు. *ప్రతి ఇంటా సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలి: జేఈవో* దీపం ఇంటికే కాదు.. సమాజానికీ వెలుగునిస్తుందని టీటీడీ జేఈవో డా. ఏ. శరత్ అన్నారు. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సకల సంపదలకు అధిష్ఠాన దేవతగా కొలువబడే శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని దీపాలతో ఆరాధించడం ద్వారా ప్రతి ఇంటా సుఖశాంతులు, సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని భక్తులు ప్రార్థించాలని ఆయన అన్నారు. భక్తి, ఆధ్యాత్మికతతో కూడిన ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో సనాతన ధర్మంపై విశ్వాసాన్ని మరింత పెంపొందిస్తాయని తెలిపారు. *మహాలక్ష్మీ దీపోత్సవం నిర్వహించడం ఆనందంగా ఉంది: ఎమ్మెల్యే* పలమనేరులో శ్రీ మహాలక్ష్మీ దీపోత్సవాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని స్థానిక ఎమ్మెల్యే శ్రీ ఎన్. అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని విజయవంతం చేసినందుకు అభినందనలు తెలిపారు. వేలాది దీపాల కాంతులతో కళాశాల ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో, భక్తిభావంతో దేదీప్యమానంగా మారిందన్నారు. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి కృప ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. *ఆగమశాస్త్రబద్ధంగా పూజా కార్యక్రమాలు* ఈ సందర్భంగా అర్చకులు ఆగమశాస్త్రోక్తంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శ్రీనివాసార్చన నిర్వహించారు. అనంతరం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో దీప పూజను భక్తిశ్రద్ధలతో చేయించారు. వేద మంత్రోచ్చారణలు, లక్ష్మీ స్తోత్ర పారాయణాలు, వేలాది దీపాల కాంతులతో ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. అమ్మవారి అనుగ్రహంతో ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని భక్తులు ప్రార్థించారు. *భక్తి.. ధర్మం.. ఆధ్యాత్మిక చైతన్యం* శ్రీ మహాలక్ష్మీ దీప పూజ ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడం, సనాతన ధర్మ విలువలను పరిరక్షించడం, భక్తిభావాన్ని మరింత బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యమని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీ శ్రీధర్ వర్మ, డిపిపి కార్యదర్శి డా. మేడసాని మోహన్, ఇతర అధికారులు, అర్చకులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ద్వారా విడుదల చేయబడినది
без подписи
без подписи
без подписи
ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతానికి వైభవంగా ఏర్పాట్లు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు విస్తృత ఏర్పాట్లు : టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఉండకూడదు : ఎమ్మెల్యే పులివర్తి నాని ఆన్ లైన్ లో ఈ నెల 13న టికెట్ల విడుదల తిరుపతి, 2026 ఆగస్టు 12: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 21న నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతాన్ని వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. తిరుచానూరులోని ఆస్థానమండపంలో బుధవారం చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నానితో కలిసి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనం, క్యూలైన్లు, తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, భద్రత తదితర ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జేఈవో సూచించారు. గత అనుభవాలను సమీక్షించి, లోపాలను సరిదిద్దుతూ భక్తులకు మరింత సౌకర్యవంతమైన ఆధ్యాత్మిక అనుభూతి కల్పించాలని ఆదేశించారు. ఆగస్టు 21న శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మీ వ్రతం ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. వ్రతం సందర్భంగా అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, ఊంజల్‌సేవలను రద్దు చేసినట్లు తెలిపారు. భక్తులకు విస్తృత సౌకర్యాలు మహిళా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున క్యూలైన్లు, పెండాళ్లు, సూచిక బోర్డులు, ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని జేఈవో ఆదేశించారు. తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదం విస్తృతంగా అందించడంతో పాటు కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, గాజులు సిద్ధంగా ఉంచాలన్నారు. భక్తుల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేలా భజన బృందాలను ఏర్పాటు చేయాలని, ఆలయం, ఆస్థానమండపం పరిసరాలను పుష్పాలు, విద్యుద్దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించాలని సూచించారు. అవసరమైన శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య, భద్రతా సిబ్బందిని సమకూర్చుకోవాలని, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా పోలీసు, పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. వరలక్ష్మీ వ్రతాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
🔺👉 what's app channel ✅ https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T
без подписи
без подписи
без подписи
*టీటీడీ జేఈవోగా శ్రీ ప్రభల గోపీనాథ్ బాధ్యతలు స్వీకరణ* తిరుమల, 2026 ఆగస్టు 10:: టీటీడీ నూతన జేఈవో (వైద్యం మరియు విద్య)గా నియమితులైన శ్రీ ప్రభల గోపీనాథ్ సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, బోర్డు సెల్ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. Make this picture into background tirumala temple and balaji with tirumala hills
*SSD & DD Tokens Issue Started @ 6.00Am* *SSD Tokens – Current Status:* • Available Tokens: 6479 *Srivari Mettu Divya Darshan Tokens:* • Available Tokens: 1521
SSD & DD Tokens Issue Started @ 8.00Am *SSD Tokens – Current Status:* • Available Tokens: 2760 *Srivari Mettu Divya Darshan Tokens:* • Available Tokens: 712
SSD & DD Tokens Issue Started @ 9.30Am *SSD Tokens – Current Status:* • Available Tokens: 8030 *Srivari Mettu Divya Darshan Tokens:* • Available Tokens: 1670
без подписи
*SSD & DD Tokens Issue Started* *SSD Tokens – Current Status:* • Available Tokens: 9903 *Srivari Mettu Divya Darshan Tokens:* • Available Tokens: 1992
Many devotees are asking about the ₹300 Special Entry Darshan tickets for 11–20 October. These tickets are currently on hold due to Navaratri Brahmotsavams & Dasara holidays. They are expected to be released towards the end of Sep or in the first week of Oct. We will share the official TTD announcement immediately once it's released.
Today free darshan 24 to 30 hours Ssd tokens counter opens today afternoon between 12pm to 4 pm afternoon