tgindex
Bharatheeya_Hindus

Bharatheeya_Hindus

Статистика

హిందూ ధర్మంపై జరిగే దాడులను తెలియజేసి హిందువులను మేల్కొలపటం ఈ సంస్థ లక్ష్యం Admin : 9246730838 Page: https://www.facebook.com/haindavasakthipage You Tube: https://www.youtube.com/c/Haindavasakthi

Последний пост
15 авг.
Последнее чтение
15 авг.
Постов за неделю
36
Всего постов
36
Тип
открытый
Язык
te
Категория
Видео
В каталоге с
13 авг.
Подписчики
4 024
−15 за 4 дн.
Сутки
−3
−0,07%
Неделя
 
Месяц
 
Просмотров на пост
171
35 постов
Вовлечённость
4,2%
к подписчикам
Постов в день
5,1
всего 36
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
245
1/48двое суток
280
1/72трое суток
302

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • без подписи

  • నిజమైన స్వాతంత్ర్య సమరయోధులు ఎవరు. https://www.facebook.com/share/r/1DFJ8c6dEF/

  • అంబేద్కర్ : ఆగష్టు 15 https://youtube.com/shorts/4n5xHLz7L5M?feature=share

  • భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు https://www.youtube.com/@Haindavasakthi

  • స్వామి వివేకానంద స్ఫూర్తి రోజుకో సూక్తి : ఆగష్టు 15 https://www.youtube.com/@Haindavasakthi

  • విదుర నీతి : ఆగష్టు 15 https://www.youtube.com/@Haindavasakthi

  • 42వ సర్గ రావణుడు హనుమంతుని పైకి సేవకులను పంపటం*   పక్షుల అరుపుల్లోను, చెట్లు విరిగి పడుతుంటే అయ్యే శబ్దాలతోను లంకలో నివసించేవాళ్ళంతా భయపడ్డారు. జంతువులు, పక్షులు ప్రాణభయంతో పరుగులుపెట్టాయి. రాక్షసులు అనేక దుశ్శకునాలు చూశారు. అప్పుడే నిద్రలేచిన రాక్షసస్త్రీలు ఉద్యానవనంలో విరిగిపోయిన వృక్షాల్ని, హనుమంతుణ్ణి చూశారు. ఆ రాక్షసస్త్రీలను భయపెట్టేందుకు మహాబాహువు, గొప్పధైర్యం కలవాడైన హనుమంతుడు తన శరీరాన్ని విపరీతంగా పెంచాడు. ఆ రాక్షసస్త్రీలంతా పర్వతాకారంలో ఉన్న హనుమంతుణ్ణి చూసి, సీతాదేవితో ఇట్లా అన్నారు. రాక్షస స్త్రీలు : ఓ సీతా! ఈ వానరుడు ఎవరు? ఎక్కడనుండి వచ్చాడు, నీతో ఏం మాట్లాడాడు. నువ్వు ఏమీ భయపడవద్దు, ఉన్నదున్నట్లుగా మాకు చెప్పు.   ఓ రాక్షసస్త్రీలారా! భయంకరమైన రూపంగల రాక్షసుల గూర్చి తెలుసుకునే జ్ఞానం నా కెక్కడిది? అతడు ఎవరో? ఎక్కడ నుండి వచ్చాడో, ఏం చెయ్యబోతున్నాడో మీకే తెలియాలి. ఎందువల్లనంటే పాము పాదాలు పాముకే కదా తెలుస్తాయి? నాకు కూడా ఇతణ్జి చూస్తే భయం వేస్తోంది. ఇతడు కూడా కామరూపుడైన రాక్షసుడే అయి ఉంటాడు. కొందరు స్త్రీలు భయంతో పారిపోయారు. ఇంకొందరు రావణునికి చెప్పటానికి పరుగెతారు. కొంతమంది మాత్రం సీతకు కాపలాగా అక్కడే ఉన్నారు. వికృతమైన ఆకారాలుగల ఆ రాక్షసులు, వికృతాకారుడు భయంకరమైన కార్యాలు చేస్తూన్న ఆ వానరుణ్ణి గూర్చి రావణునికి చెప్పారు.   “మహారాజా! భయంకరమైన శరీరంతో, అమితమైన పరాక్రమం గల వానరుడొకడు సీతతో ఏదో మాట్లాడాడు. మేము సీతను ఎంత గుచ్చిగుచ్చి అడిగినా ఆ వానరుణ్ణి గూర్చి ఏమీ చెప్పడంలేదు. అతడు దేవేంద్రుడికో, కుబేరుడికో దూత అయివుంటాడు. వాళ్ళు రాముడికి సహాయం చెయ్యటానికే ఈ వానరుణ్ణి పంపి ఉంటారని మేము అనుకుంటున్నాం. అతి మనోహరమైనది, అనేక పక్షులు మృగాలకు నివాసమైన ఉద్యానవనం అంతా నాశనమైపోయింది. ఆ ఉద్యానవనంలో ఒక్క సీత కూర్చునే చోటు తప్పించి మిగిలిన వనమంతా సర్వనాశనం చేశాడు. జానకిని రక్షించడానికి ఆ చోటు మాత్రం నాశనం చెయ్యకుండా విడిచిపెట్టాడని మేం అనుకుంటున్నాం. ఆమె కూర్చునే శింశుపావృక్షాన్ని మాత్రం అతడు విరవకుండా వదలివేశాడు. కాబట్టి ఆ వానరాన్ని పట్టి కఠినమైన శిక్ష విధించాలి. ఓ రాజా! ఈ వానరుడెవరో ప్రాణాలకు తెగించియే సీతతో మాట్లాడాడు” అని చెప్పారు. రాక్షసరాజైన రావణుడు, రాక్షసస్త్రీల మాటలు విని కోపంతో మండిపడ్డాడు. కళ్ళు రెండూ హోమగుండాల్లాగా మండిపోయాయి, మండేదీపం నుండి నూనెబొట్లు కారినట్లుగా అతడి కన్నులనుండి కన్నీటిబొట్లు జలజలా రాలాయి మహాతేజశ్శాలియైన రావణుడు, హనుమంతుని బంధించమని ఎనభైవేలమంది 'కింకరు” లనే రాక్షసజాతి వాళ్ళను నియోగించాడు. వాళ్ళంతా రావణాసురుడంతబలశాలురు .పొడవైన కోరలు, భయంకరమైన ఆకారం గల ఆ కింకరులంతా కూటములు, ముద్దరములనె ఆయుధాల్ని ధరించి ఉత్సాహంగా యుద్దానికి బయలుదేరి వెళ్ళారు. వాళ్ళ కోసమే హనుమంతుడు ముఖద్వారం దగ్గర నిలబడి ఉన్నాడు. ఆ కింకరులంతా పరిఘలతోను, గదలతోను, సూర్యునివలె మెరిసే బాణాలతోను హనుమంతుని కొట్టారు. మిగతావాళ్ళంతా ముద్దరములు, పట్టిసములు, శులాలు, ప్రాసలు, తోమరాలు, కత్తులు పట్టుకొని హనుమంతుణ్ణి చుట్టుముట్టారు.   మహాతేజోవంతుడైన ఆ హనుమంతుడు తోక నేలపై కొట్టి గొప్పశబ్దం చేశాడు. దేహాన్ని పర్వతమంతగా పెంచేశాడు. లంకా పట్టణానికంతా వినిపించేట్లుగా జబ్బలు చరిచాడు. ఆ ధ్వనికి పక్షులు, జంతువులు భయపడి పారిపోయాయి. కొన్ని పక్షులు నేలవాలాయి. హనుమంతుడు తన శరీరాన్ని పర్వతమంత పెద్దది చేసి పెద్దగా కేకలు వేశాడు. “మహా బలశాలియైన రాముడికి జయం, మహాబలవంతుడైన లక్ష్మణునికి జయం. రాముడిచే కాపాడబడిన సుగ్రీవుడికి జయం. ఓ రాక్షసులారా! నేను వాయుపుత్రుడనైన హనుమంతుడను. శ్రమలేకుండా కార్యాలు చక్కబరచే కోశలాధిపతియైన రామునికి దాసుడను. నేను రాళ్ళు, వృక్షాలు శత్రువులమీదికి విసురుతూ యుద్ధం చేస్తాను. వెయ్యిమంది రావణులైనా నన్ను ఎదిరించలేరు. నేను మీరంతా చూస్తూ ఉండగానే ఈ లంకాపట్టణాన్నంతా నాశనం చేసి సీతాదేవికి నమస్కరించి వెళ్తాను.   హనుమంతుడి కేకలు విన్న ఆ కింకర రాక్షసులంతా భయభ్రాంతులయ్యారు. సంధ్యాకాలపు మేఘంలాగా నిలబడిన హనుమంతుణ్ణి చూశారు. ఆ కింకరులంతా నాలుగు వైపులనుండి భయంకరమైన ఆయుధాల్ని విసిరారు. అప్పుడు హనుమంతుడు ముఖద్వారం దగ్గర ఉన్న పెద్దఇనుప ద్వారాన్ని ఊడబెరికాడు. వీరుడైన ఆ హనుమంతుడు ఆ ద్వారాన్నే ఆయుధంగా చేసుకొని రాక్షసుల్ని కొట్టి చంపాడు. సర్పాన్ని కాళ్ళకు చుట్టుకొని గరుత్మంతుడు ఆకాశంలో తిరిగినట్లు హనుమంతుడు ఆ ఇనుప ద్వారాన్ని చేతబుచ్చుకొని గిరగిరా త్రిప్పుతూ ఆకాశంమంతా తిరిగాడు. ఆ వచ్చిన కింకరులంతా చచ్చిపడిపోయారు. హనుమంతుడికి యుద్దాన్ని ఆపడం ఇష్టంలేదు. రావణుడు మరికొంత సైన్యాన్ని తప్పక పంపగలడని ఎదురుచూస్తూ ఆ ముఖద్వారం దగ్గరే నిలబడ్డాడు. వాళ్ళల్లో మిగిలిన ఒకరిద్దరు భయంతో పరుగెత్తుకుని పోయి, కింకరులందరూ యుద్ధంలో మరణించారని చెప్పారు. ఆ మహాబలశాలురంతా చనిపోయారని విన్న రావణుడు గుడ్లు తేలేశాడు. ఈసారి అతి పరాక్రమశాలీ ప్రహస్తుని కుమారుడూ అయిన జంబుమాలిని హనుమంతుడి మీదకు పంపాడు.

  • శ్రీ అరబిందో ఘోష్ జయంతి https://www.youtube.com/@Haindavasakthi

  • అంబేద్కర్ : ఆగష్టు 14 https://youtube.com/shorts/2juEgc6c2y0?feature=share

  • గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలం, వడ్లమూడి గ్రామంలో జిల్లా పరిషత్ కు చెందిన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన అక్రమ మసీదు నిర్మాణం పై స్పందనలో ఫిర్యాదు చేసిన హైందవశక్తి                               గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలం, వడ్లమూడి గ్రామం 'CRDA పరిధిలో', గుంటూరు నుండి తెనాలి వెళ్లే ప్రధాన రహదారికి కుడివైపున, క్వారీలోని కొత్త శివాలయం దాటిన తర్వాత, విజ్ఞాన్ యూనివర్సిటీ సమీపంలో ""జిల్లా పరిషత్ కు చెందిన ప్రభుత్వ స్థలం""ఉన్నది.సదరు ప్రభుత్వ స్థలాన్ని  ఆక్రమించుకొని, ఎటువంటి ప్రభుత్వ అనుమతులూ లేకుండా, మస్జిద్-ఏ-హాజరత్ బిలాల్ పేరిట ఒక అక్రమ మసీదు నిర్మాణం చేశారు.ఈ నిర్మాణానికి ""గ్రామ పంచాయతీ అనుమతి, DTCP/CRDA అనుమతి, భూమి కేటాయింపు పత్రాలు""ఏమీ లేవు.   ఈ విషయాన్ని గమనించిన మన "హైందవశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు సేడింబి  ప్రసాద్" గారు 10 08 2026 న జరిగిన  స్పందన కార్యక్రమంలో  ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ, జోనల్ జాయింట్ డైరెక్టర్ -గుంటూరు డివిజన్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది.  ఈ విషయం పై సదరు ప్రభుత్వ అధికారులు తీసుకునే చర్యలను బట్టి తదుపరి మన కార్యాచరణ ఉండబోతుంది. అందుకే మనమంటాము......... "హైందవశక్తి" అంటే పోరాటం...... పోరాటం అంటేనే "హైందవశక్తి"... ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తే సంప్రదించండి: హైందవశక్తి Legal Advisor, High Court Advocate ధూపం.చంద్రశేఖర్ గారు- గుంటూరు Cell: 80963 11785. Join హైందవశక్తి 9246730838 https://www.facebook.com/share/p/195Yxvc7DX/

  • విదుర నీతి : ఆగష్టు 14 https://www.youtube.com/@Haindavasakthi

  • స్వామి వివేకానంద స్ఫూర్తి రోజుకో సూక్తి : ఆగష్టు 14 https://www.youtube.com/@Haindavasakthi

  • 41వ సర్గ హనుమంతుడు ఉద్యానవనాన్ని ధ్వంసం చెయ్యడం   హనుమంతుడు సీతాదేవి సందేశాన్ని మనస్సుకు పట్టించుకున్నాడు. ఆమె అనుమతి పొంది కొద్దిదూరం పోయి ఆలోచించసాగాడు. నల్లనికన్నులు గల ఆ సీతాదేవిని చూశాను, ఇంకా కొద్దిపాటి పని మిగిలివుంది. ఈ రాక్షసుల్ని ఏదో విధంగా దారిలోకి తీసుకురావాలి. ఏమిటా దారి? సామోపాయం వీళ్ళతో సరిపడదు. వీళ్ళే ఐశ్వర్యవంతులు కాబట్టి దానం కూడా వీళ్ళ దగ్గర పనిచెయ్యదు. వీళ్ళు అమితమైన బలాఢ్యులు కావటంచేత భేదోపాయం కూడా సరిపడేట్లు లేదు. ఇక మిగిలిందల్లా దండోపాయం. ఇప్పుడు నా పరాక్రమం చూపటం ఒక్కటే ఉపాయంగా తోస్తోంది. కొంతమంది మహావీరుల్నెనా చంపితే మిగిలినవాళ్ళు దారికి రావచ్చునేమో! ఎవరికైనా ఒక పని అప్పజెప్పినప్పుడు, ఆ కార్యానికి భంగం కలగకుండా, దానికి సంబంధించిన చిన్నాచితకా కార్యాల్ని ఎవడు సాధిస్తాడో అతబ్జే కార్యసాధకుడంటారు. కార్యం ఎంత చిన్నదైనా దాన్ని సాధించేందుకు ఒక ఉపాయాన్ని ఆలోచించాలి. అట్లాంటి ఉపాయాలు కూడా అనేకం ఉండొచ్చు. వాటిలో ఉత్తమమైన ఉపాయాన్ని ఎన్నుకున్నవాడినే సమర్ధుడు అని అంటారు. యుద్దంలో శత్రువుల బలాన్ని, మన బలాన్ని బేరీజు వేసుకొని సుగ్రీవుడి దగ్గరకు వెళ్ళినట్లయితే నేను ప్రభువు ఆజ్ఞను బాగా అమలుపరచిన వాణ్ణి అవుతాను.   ఇప్పుడు నాకూ, రాక్షసులకూ పెద్ద ఎత్తున యుద్ధం జరిగినప్పుడేగానీ వారి బలం ఎంతో, నా బలం ఎంతో తెలియదు. మంత్రులు, సేనానాయకులతో కూడిన రావణుని బలం కూడా బయటపడ్డుంది. అట్లాగే రావణాసురుడి యుద్ధమ్యాహం ఏమిటో కూడా తెలుసుకోగలుగుతాను. ఆ విధంగా రాబోయే యుద్ధంలో రాక్షసులకూ, వానరులకూ ఉందే తారతమ్యాన్ని తెలుసుకొని సుగ్రీవుడికి చెప్పవచ్చు, ఆ తరువాత నా దారిన నేను పోతాను అని అనుకున్నాడు. క్రూరుడైన ఈ రావణాసురుడి ఉద్యానవనం పూలు, పండ్లు, లతలతో నిండి దేవేంద్రుడి నందనవనంలాగా ఉంది. ఎండిపోయిన అడవిని అగ్నిహోత్రుడు దహించినట్లుగా, నేను ఈ ఉద్యానవనాన్ని నాశనం చేస్తాను. అప్పుడు రావణునికి కోపంవచ్చి, అశ్వములతోను, రథాలతోను, ఏనుగులతోను, మహారథులతోను, వివిధమైన ఆయుధాలనిచ్చి నన్ను బంధించమనో లేక చంపమనో గొప్పసైన్యాన్ని పంపవచ్చు. అప్పుడు నేను కోరుకున్నట్లుగా నా పరాక్రమాన్ని చూపి రావణసైన్యాన్ని చంపి సుగ్రీవుని వద్దకు వెళ్తాను.   ఇలా ఆలోచించి విజృంభించిన హనుమంతుడు తన తొడల వేగంతో, పెనుగాలికి వృక్షాలు విరిగిపడ్డట్లుగా, వృక్షాలన్నింటిని విరిచి పడేశాడు. ఉద్యానవనంలోని చెట్లనన్నింటినీ విరగ్గొట్టాడు. చెరువుల, సరస్సుల గట్లన్నీ తెగనరికి వేశాడు. పర్వతశిఖరాలను విరగ్గొట్టాడు. నందవనంలాగా మనోహరంగా ఉండే ఉద్యానవనం అంతా పెనుతుపానులో చిక్కునట్లు, దావాగ్నిచే దహించివేయబడినట్లు కనబడ్డది. అందమైన లతలన్నీ దుఃఖాక్రాంతులైన స్త్రీలవలె పడిపోయాయి. పక్షులన్నీ నివాసాలు కోల్పోయి, దీనంగా అరుస్తూ ఎగిరిపోయాయి.లతాగృహాల్ని, చిత్రగృహాల్ని పడగొట్టాడు. రాతిగృహాలు, ఇతర గృహలన్నింటినీ నేలకూల్చాడు. క్రూరమృగాల్ని, క్రూరసర్పాలను స్వేచ్చగా విడిచేశాడు. ఇప్పుడా ఉద్యానవనం తన శోభనంతా కోల్పోయింది. రావణుని స్త్రీలకు ఆనందాన్ని కలిగించే అశోకలతలన్నీ నేలపాలయ్యాయి.   హనుమంతుడు రావణునికి కోపం కలిగేట్లుగా ఏమేం చెయ్యాలో అవన్నీ చేశాడు. రావణుని సైన్యాన్ని ఎదిరించడానికి సిద్ధంగా అశోకవనంలో ముఖద్వారం వద్దకు వచ్చి కూర్చున్నాడు.   https://www.youtube.com/@Haindavasakthi

  • దేశ విద్రోహ దినం https://www.youtube.com/@Haindavasakthi

  • దేశ విభజన భయానక దినోత్సవం https://www.youtube.com/@Haindavasakthi

  • అంబేద్కర్ : ఆగష్టు 13 https://youtube.com/shorts/LIfnWLUHp9c?feature=share

  • *గుంటూరు జిల్లా,కాకుమాను మండలం,రేటూరు గ్రామంలోని నివాస గృహాల మధ్య ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న అక్రమ చర్చి నిర్మాణం గురించి ఫిర్యాదు చేసిన హైందవశక్తి* గుంటూరు జిల్లా,కాకుమాను మండలం,రేటూరు గ్రామం లోని ఊటుకూరి.నాగేశ్వరరావు గారి మిల్ దగ్గర; కొండపాటూరు రామ్ శంకర్ గారి సొంతస్థలంలో; అతని ఆధ్వర్యంలోనే; హిందూ నివాస గృహాల మధ్యలో పాస్టర్.గాజుల అబ్రహము, పాస్టరమ్మ గాజుల. రూతు గార్ల-"పరిశుద్ధ ప్రేమ సువార్త ప్రార్ధనా మందిరము" పేరిట ఒక చర్చి నిర్మించి నిర్వహిస్తున్నారు. సదరు విషయంగా స్థానిక కార్యకర్త ఒకరు కలసి నిన్న అనగా 10-08-2026వ తేదీ సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో జరిగిన "ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక"ద్వారా మన ధూపం.జీ సహకారంతో లిఖితపూర్వక ఫిర్యాదులు సమర్పించారు.మనం ఇచ్చిన  ఫిర్యాదు సంబందిత శాఖాధికారులకు బదలాయించ బడ్డాయి.వారు వారు తీసుకొనే చర్యలను బట్టి తదుపరి మన కార్యాచరణ ఉండబోతోంది....... అందుకే మనమంటాము......... "హైందవశక్తి" అంటే పోరాటం...... పోరాటం అంటేనే "హైందవశక్తి"... ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తే సంప్రదించండి: హైందవశక్తి Legal Advisor, High Court Advocate ధూపం.చంద్రశేఖర్ గారు- గుంటూరు Cell: 80963 11785. Join హైందవశక్తి 9246730838 https://www.facebook.com/share/p/1KANiqtPWE/

  • స్వామి వివేకానంద స్ఫూర్తి రోజుకో సూక్తి : ఆగష్టు 13 https://www.youtube.com/@Haindavasakthi

  • విదుర నీతి : ఆగష్టు 13 https://www.youtube.com/@Haindavasakthi

  • 40వ సర్గ హనుమంతుడు ఉత్తర దిక్కుగా ప్రయాణమవటం   దేవకన్యతో సమానురాలైన సీతాదేవి హనుమంతుని మధురమైన మాటలు విని ఇట్లా అంది   “ఓ హనుమంతుడా! సగంసగం సస్యం మొలకెత్తిన భూమి వర్షపు చినుకులు పడగానే వికసించినట్లు, నీ మంచి మాటలతో నా మనస్సు ఆనందంతో పరవశిసోంది. దుఃఖంతో నీరసించిపోయిన నా చేతులతో పురుషశ్రేష్ణుడైన నా రాముణ్ణి ఒక్కసారి ఒళ్ళంతా తడమాలని ఉంది. నా ఆ కోరిక తీరేట్లు చూడు; నీకు పుణ్యం ఉంటుంది.   “ఓ హనుమంతుడా! కాకి మీద కోపంతో గడ్డిపరక విసరి కన్నుపోగొట్టిన విషయాన్ని రాముడికి గుర్తుచెయ్యి. “ఓ రామా! ఒకనాడు నా నుదుట తిలకం చెరిగిపోగా మణిశిలతో నుదుట పెట్టాల్సిన బొట్టును నా బుగ్గకు బాగా పైభాగాన పెట్టావు గుర్తుందా?” అని గుర్తు చెయ్యి. “ “అటువంటి ప్రేమపాత్రుడవైన నీవు నేను రాక్షసులచేత బంధించబడి నానాకష్టాలు పడుతూవుంటే ఇట్లా ఉపేక్షచేయడం బాగుందా” అని అడుగు.   “ “ఓ రామా! ఈ చూడామణిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. ఈ కష్టకాలంలో దాన్ని చూసుకుంటూ నువ్వే నా ప్రక్కన ఉన్నట్లుగా భావించి సంతోషిస్తున్నాను. నీటిలోనుండి ఉద్భవించిన ఆ చూడామణిని నీకు పంపేస్తున్నాను, ఇకపై నేను ఆ కాస్త సంతోషాన్నీ కూడా కోల్పోయి జీవించలేను.”   “నువ్వు ఎప్పటికైనా వచ్చి నన్ను తీసుకొని వెళ్తావన్న ఆశతో ఈ రాక్షసులు పెట్టే బాధలు భరిస్తున్నాను. ఓ శత్రుసంహారకుడా! నేను ఇకపై నెలరోజులే జీవించి ఉంటాను. ఈ రావణాసురుడు చాలా క్రూరుడు, కామంతో కన్ను మూసుకుపోవటంవల్ల అతడి దృష్టి సరిగాలేదు. ఇంకా ఆలస్యం చేస్తే నువ్వు నన్ను చూస్తావేమోగాని నేను నిన్ను చూడలేను. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వచ్చేయి.”   గొప్పతేజస్సు గల హనుమంతుడు, సీత కన్నీరుమున్నీరై ఏడుస్తూ చెప్పిన మాటల్ని విని ఇట్లా అన్నాడు: “ఓ సీతాదేవీ! రాముడు గుర్తించగలిగేది, రాముడు మనస్సును సంతోషపెట్టేదైన మరొక జ్ఞాపికను ఏదైనా ఇవ్వు” అని అడిగాడు. అందుకు సీతాదేవి “ఓ హనుమంతుడా నేను ఇంతకు పూర్వమే ఉత్తమమైనది, చూడగానే రాముడు గుర్తించేదైన చూడామణిని ఇచ్చాను. ఆ మణిని చూడగానే నీవు నన్ను చూసినట్లుగా రాముడు విశ్వసిస్తాడు” అంది.   శ్రీమంతుడు, వానరులలో శ్రెష్ణుడైన హనుమంతుడు ఆ చూడామణిని గ్రహించి బీ త్రకు నమస్కరించి బయలుదేరడానికి తన శరీరాన్ని పెంచి ఎగరటానికి సిద్ధపడుతూ ఉందగా సీత్రాదేవి మళ్ళీ ఇట్లా అంది.   “ఓ హనుమంతుడా! సింహంవంటి పరాక్రమంగల రామలక్ష్మణుల్ని, సుగ్రీవుడి, అతడి పరివారపు క్షేమాన్ని మరీమరీ అడిగానని చెప్పు. నీవు వెళ్ళగానే రాముడి కోసం దిగులుతో దుఃఖీస్తున్నానని, ఈ రాక్షసస్త్రీలు పెట్టే బాధలు భరించలేకుండా ఉన్నానని చెప్పు. నీవు క్షేమంగా సముద్రం దాటి రాముణ్ణి చేరాలని కోరుకుంటున్నాను.” కార్యసాధకుడైన హనుమంతుడు, సీత చెప్పిన విషయాలన్నీ మనస్సులోనే మననం చేసుకుంటూ, ఇంకా మిగిలివున్న కొద్దిపాటి పనులు చక్కబెట్టుకునెందుకు ఉత్తరదిక్కుగా బయలుదేరాడు.   https://www.youtube.com/@Haindavasakthi