సనాతన ధర్మం
Статистикаప్రతీరోజు మహా భారతం, పురాణాలు ఇతి హాసాలు జీవిత చరిత్రలు క్షేత్ర మహత్యాలు అవన్నీ గ్రూప్ లో పంచుకోవటం జరుగుతుంది, ఆధ్యాతిక విషయములు మాత్రమే ఈ గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. 🕉️
- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 14 авг.
- Постов за неделю
- 23
- Всего постов
- 35
- Тип
- открытый
- Язык
- te
- Категория
- Новости и СМИ (по похожим)
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 153
- 1/48двое суток
- 175
- 1/72трое суток
- 189
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
без подписи
без подписи
без подписи
без подписи
без подписи
ఈరోజు (14-08-2026) శ్రావణ మాస శుద్ధ విదియ శుక్రవారం,వానపల్లి, శ్రీ పళ్ళాలమ్మ వారి అలంకరణ 🙏 యా దేవీ సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || తాత్పర్యం: సకల ప్రాణుల యందు 'తల్లి' (మాతృ) రూపంలో కొలువై ఉన్న ఓ జగన్మాతా, నీకు నమస్కారము. భక్తితో నీకు పదే పదే నమస్కరిస్తున్నాను.
14-08-2026 పంచాంగము
భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు, సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే | శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే || అర్థం: సకల శుభాలను కలిగించేదానా, శివుని పత్ని, కోరిన కోర్కెలు తీర్చేదానా, శరణు కోరిన వారిని రక్షించేదానా, మూడు కన్నులు గల గౌరీ దేవి, నారాయణీ! నీకు నమస్కారము. "ఓం శ్రీ మావుళ్ళమ్మ దేవ్యై నమః"
సనాతన ధర్మం గ్రూప్ సభ్యులకు విజ్ఞప్తి మన గ్రూప్ లో ఉన్న ప్రతీ ఒక్కరూ నూతన సభ్యులను చేర్చండి, ప్రతీ ఒక్కరూ ఒక 10 మందిని చేర్చండి, మన ఛానెల్ లింక్ ని గ్రూప్ లలోకి మీ స్నేహితులకి పంపి మన గ్రూప్ ఎదుగుదలకు తోడుగా నిలవండి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి గ్రూప్ లో మెంబెర్స్ ని ఈ విధంగా add చేయండి 1. గ్రూప్ టైటిల్ మీద క్లిక్ చేయండి. 2. క్రిందన "Add Member" ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే , మీ కాంటాక్ట్స్ కనిపిస్తాయి. 3. కాంటాక్ట్స్ మీద క్లిక్ చేస్తూ ఉంటే, అవన్నీ సెలెక్ట్ అవుతూ ఉంటాయి. 4. మొత్తం సెలెక్ట్ చేసి "√" గుర్తు పై క్లిక్ చేయండి. 5. చివరకు "Add" అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే గ్రూప్ లో మెంబెర్స్ add చేయబడతారు. లేదా గ్రూప్ లింక్ చానల్ లింక్ మీరు ఉన్న what's app గ్రూప్ లలో షేర్ చేయగలరు, సనాతన ధర్మం నుండి తంగిరాల చంద్రశేఖర అవధాని, 13-08-2026 చంద్రశేఖర పాహిమాం
🚩*శ్రీ గురుచరిత్ర 11వ అధ్యాయము*🚩 *శ్రీగురుని జననము,లీలలు* https://youtu.be/CShVXV339b0
без подписи
🚩జగద్గురు ఆది శంకరాచార్య స్వామి దివ్య చరిత్ర భాగం- 15 🚩 ✨బాల కాండము లో తొమ్మిదవ భాగం (9)✨ 🛕ఉభయభారతీ విశ్వరూపుల పరిణయము? సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమామ్ | అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామ్ || "శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్| నమామి భగవత్పాద శంకరం లోకశంకరమ్||" హర హర శంకర! జయ జయ శంకర! ✨ కథా ప్రారంభము పెళ్లి పందిళ్ళు వేసేవారు ఎంతో ఉత్సాహంగా, మామిడి తోరణాలతో, పచ్చని మావి చిగుళ్లతో వివాహ వేదికను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆ ఊరంతా పందిళ్లతో, కళకళలాడుతున్న పెళ్లివారితో కోలాహలంగా మారిపోయింది. మగపెళ్లివారికి విడిది చేయడానికి తగిన ఏర్పాట్లు చేశారు. మేళతాళాలు, మంగళవాద్యాలు అన్నీ సిద్ధం చేసుకుని, విష్ణుమిత్రుని బంధుమిత్రులందరూ మగపెళ్లివారి రాకకోసం ఆత్రుతగా ఎదురుచూడసాగారు. మరోవైపు హిమమిత్రుని వెంట ఊరి ప్రజలందరూ ప్రయాణమయ్యారు. బ్రాహ్మణులు, మిత్రులు, బంధువులు, వేద పండితులు, మంగళవాద్యాలు మోగుతుండగా, ఒక శుభ ముహూర్తాన మగపెళ్లివారు బయలుదేరారు. ముత్యాల పల్లకీలో చిరునవ్వులు చిందిస్తూ పెళ్లికొడుకు విశ్వరూపుడు ఆసీనుడయ్యాడు. ఆ జనసందోహం చూస్తుంటే... శత్రువులపై విజయ పరంపరలు సాధించడానికి కదులుతున్న సైన్యవాహినిలా వైభవంగా విరాజిల్లుతూ. మార్గమధ్యంలో బస చేస్తూ, ఎక్కడా తొందరపాటు లేకుండా ప్రశాంతంగా తరలివచ్చారు. చివరకు వారు శోణ నదీతీరానికి చేరుకోగానే, చెవులు రింగుమనేలా తూతూబాకాలు మ్రోగాయి. అది మగపెళ్లివారు వచ్చేసారన్న సంకేతం! ఆ ధ్వని వినగానే ఉత్సాహంతో ఉలిక్కిపడిన కన్యాదాత విష్ణుమిత్రుడు వెంటనే ఎదురేగి స్వాగతం పలికి . వారిని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విడిది గృహంలో ప్రవేశపెట్టాడు. ఇరువైపుల పెద్దలు ఎంతో గౌరవమర్యాదలతో ఒకరినొకరు పలకరించుకున్నారు. అనంతరం వేదోక్తంగా, అత్యంత వైభవంగా వివాహ మహోత్సవం కన్నులపండువగా ముగిసింది. స్వయంగా బ్రహ్మదేవుని అవతారమైన విశ్వరూపుడు (మండనమిశ్రుడు) మంగళసూత్రాన్ని ఉభయభారతి గళసీమలో అలంకరించాడు. ఆ నూతన వధూవరుల ముత్యాల తలంబ్రాల వేడుకను చూసి తరించాల్సిందే! పెళ్లిలో అన్నింటికంటే భావోద్వేగమైన తంతు అప్పగింతలు. తల్లిదండ్రులకు, తోబుట్టువులకు, పెద్దలందరికీ మంత్రయుక్తంగా కన్యాదానాన్ని పూర్తి చేసి ఆ వధువును అప్పజెప్పారు. ఆ సమయంలో ఆ పిల్లను కన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడమే కాక, అక్కడికి వచ్చిన వారందరూ ఆ అప్పగింతల ఘట్టాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు. సరళీకరణ: ✍️ తంగిరాల చంద్రశేఖర అవధాని 📅 13-08-2026 పేజీ/ గ్రూప్:- సనాతన ధర్మం ఓం నమః శివాయ! 🔱 హర హర శంకర! జయ జయ శంకర! 🌸 సశేషం
🚩 మహాభారతం || అరణ్య పర్వము 🚩 📖 ద్వితీయాశ్వాసము (25) 🕉️ (సనాతన ధర్మం నుండి) 🕉️ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం | దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ || యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః | తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ || "ధర్మజా! కురుక్షేత్రం, నైమిశతీర్థం, పుష్కరత్రయం అనేవి ఈ భూలోకంలో అత్యంత పవిత్రమైన మూడు పుణ్యక్షేత్రాలు. ఇందులో కురుక్షేత్రం.. సరస్వతీ నదికి దక్షిణాన, దృషద్వతీ నదికి ఉత్తరాన విస్తరించి ఉంది. ఆ కురుక్షేత్రంలో 'శమంతక పంచకముల' నడుమ, 'రామహ్రదం' అనే సరస్సు మధ్యలో ఉన్న పితామహుడు బ్రహ్మదేవుని 'ఉత్తరవేది' అనబడే కురుక్షేత్రాన్ని దర్శించిన వారికి సమస్త పాపాలు నశిస్తాయి. విష్ణుస్థానములో శ్రీమహావిష్ణువును పూజించినా; పారిఫ్లవ, పృథివీ, శాలూకినీ, సర్వతీర్థ, వరాహ, అశ్వినీ తీర్థాలలోనూ; జయంతిలో ఉండే సోమ తీర్థంలోనూ, కృతశౌచ తీర్థంలోనూ స్నానమాచరించినా ఎంతో పుణ్యం కలుగుతుంది. అగ్ని వటక్షేత్రంలో, ముంజవట క్షేత్రంలో శివారాధన చేసినా, యక్షిణీ తీర్థంలో స్నానం చేసినా భక్తుల కోరిన కోరికలు నెరవేరుతాయి. జమదగ్ని మహాముని కుమారుడైన పరశురాముడు, తన దివ్యమైన గొడ్డలితో దుష్ట రాజులందరినీ సంహరించినపుడు వారి రక్తం ప్రవహించి ఐదు పెద్ద పాయలుగా ఏర్పడింది. దానినే 'శమంతక పంచకము' అంటారు. ఆ ప్రాంతంలో పరశురాముడు తన పితృదేవతలకు తర్పణాలు విడిచాడు. అప్పుడు పితృదేవతలు అతనికి సాక్షాత్కరించి వరాలు కోరుకోమన్నారు. అందుకు పరశురాముడు.. 'క్షత్రియులను సంహరించడం వలన నాకు అంటరాని పాపం నశించాలి, నాకు పుణ్యలోకాలు ప్రాప్తించాలి, ఈ శమంతక పంచకము లోక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం కావాలి' అని కోరుకున్నాడు. అప్పటినుండి ఆ శమంతక పంచక ప్రాంతాలు పరమ పవిత్రమైన పుణ్యతీర్థాలుగా శోభిల్లుతున్నాయి. వాటిలో స్నానం చేస్తే అశ్వమేధయాగఫలం కలుగుతుంది. ఇంకా కాయశోధనం, లోకోద్ధారం, శ్రీ తీర్థం, కపిలతీర్థం, సూర్యతీర్థం, గోభవనం, శంఖినీ తీర్థం, యక్షేంద్రతీర్థం, సరస్వతీనదీ సంగమం, మాతృతీర్థం, బ్రహ్మావర్తం, శరవణం, శ్వావిల్లోమాపహం, మానుషతీర్థం, ఆపగ నదీ తీర్థం, బ్రహ్మోదుంబరం, సప్తర్షికుండం, కేదారం, కపిలకేదారం, సరకం, ఇలాస్పదం, కిందానం, కింజప్యం.. వంటి పవిత్ర తీర్థాలలో స్నానం చేసినా అనంతమైన పుణ్యాలు లభిస్తాయి." సరళీకరణ: ✍️ తంగిరాల చంద్రశేఖర అవధాని 🗓️ తేదీ: 13 ఆగస్టు, 2026 📌 పేజీ/గ్రూప్: సనాతన ధర్మం మాతో కనెక్ట్ అవ్వండి: 🚩 Facebook: https://www.facebook.com/share/18BVkU8sFw/ 🚩 WhatsApp Channel: https://whatsapp.com/channel/0029VamwYOp89inl15KDVT3X సశేషం...
🕉️ పరాభవ నామ సంవత్సర శ్రావణ మాసం పర్వదినాలు (2026) 🌺 శ్రావణ మాసం ప్రారంభం: 13 ఆగస్టు, 2026 (గురువారం) శ్రావణ మాసం ముగింపు: 11 సెప్టెంబర్, 2026 (శుక్రవారం) 🌕 పౌర్ణమి / అమావాస్య: 🌑 👉 శ్రావణ పౌర్ణమి: 28 ఆగస్టు, 2026 (శుక్రవారం) (రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి, యజుర్వేదులకు ఉపాకర్మ) 👉 శ్రావణ అమావాస్య: 11 సెప్టెంబర్, 2026 (శుక్రవారం) (పోలాల అమావాస్య - సంతానం ఆయురారోగ్యాల కోసం చేసే విశిష్టమైన వ్రతం) 🌺 శ్రావణ మాసంలో శుక్రవారాలు (2026) 🌺 * 14 ఆగస్టు, 2026 - శ్రావణ శుద్ధ విదియ (మొదటి శ్రావణ శుక్రవారం) * 21 ఆగస్టు, 2026 - శ్రావణ శుద్ధ దశమి (రెండవ శ్రావణ శుక్రవారం - శ్రీ వరలక్ష్మీ వ్రతానికి అత్యంత శ్రేష్టమైన రోజు) * 28 ఆగస్టు, 2026 - శ్రావణ పౌర్ణమి (మూడవ శ్రావణ శుక్రవారం) * 04 సెప్టెంబర్, 2026 - శ్రావణ బహుళ అష్టమి (నాలుగవ శ్రావణ శుక్రవారం) * 11 సెప్టెంబర్, 2026 - శ్రావణ బహుళ అమావాస్య (ఐదవ శ్రావణ శుక్రవారం) ✨ ముఖ్యమైన పండుగలు & పర్వదినాలు ✨ * 🐍 గరుడ పంచమి / నాగుల పంచమి: 17 ఆగస్టు, 2026 (సోమవారం) (గమనిక: కొన్ని పంచాంగాల లేదా సిద్ధాంతాల రీత్యా 18 ఆగస్టు మంగళవారం నాడు కూడా ఆచరిస్తారు) * 🌞 రవి సింహ సంక్రమణం: 18 ఆగస్టు, 2026 (మంగళవారం) * 🌸 మంగళ గౌరీ వ్రతం (మొదటి వారం): 18 ఆగస్టు, 2026 (మంగళవారం) (శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం ఈ వ్రతం ఆచరిస్తారు) * 🙏 శ్రీ వరలక్ష్మీ వ్రతం: 21 ఆగస్టు, 2026 (శుక్రవారం) * 🌼 శ్రావణ శుద్ధ ఏకాదశి: 23 ఆగస్టు, 2026 (ఆదివారం) (కొన్ని సిద్ధాంతాల రీత్యా ఏకాదశి ఘడియలను బట్టి ఇందులో మార్పు ఉండవచ్చు) * 📿 రాఖీ పౌర్ణమి / జంధ్యాల పౌర్ణమి: 28 ఆగస్టు, 2026 (శుక్రవారం) * సంకటహర చతుర్థి: 31 ఆగస్టు, 2026 (సోమవారం) * 🦚 శ్రీ కృష్ణాష్టమి (గోకులాష్టమి): 04 సెప్టెంబర్, 2026 (శుక్రవారం) (గమనిక: స్మార్త, వైష్ణవ సిద్ధాంతాల భేదాల రీత్యా కొన్ని ప్రాంతాల్లో 05 సెప్టెంబర్ శనివారం నాడు కూడా జరుపుకుంటారు) * 🌿 శ్రావణ బహుళ ఏకాదశి: 07 సెప్టెంబర్, 2026 (సోమవారం) * 🔱 మాస శివరాత్రి: 09 సెప్టెంబర్, 2026 (బుధవారం) (గమనిక: కొన్ని పంచాంగాల లేదా సిద్ధాంతాల రీత్యా మాస శివరాత్రి మార్పు ఉండవచ్చు గమనించగలరు) * 🐄 పోలాల అమావాస్య: 11 సెప్టెంబర్, 2026 (శుక్రవారం) ముఖ్య సూచన: కొన్ని పంచాంగాలలో (దృగ్గణిత / సూర్య సిద్ధాంత) గణనల రీత్యా పండుగ తేదీల్లో ఒక రోజు అటు ఇటుగా మార్పులు ఉండవచ్చు. గమనించగలరు. *సనాతన ధర్మం నుండి* వేద, స్మార్త, జ్యోతిష్య పండితులు, తంగిరాల చంద్రశేఖర అవధాని, 13-08-2026 మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం సనాతన ధర్మం ను ఫాలో అవ్వండి 🪷 👇 Facebook:- https://www.facebook.com/share/1YSNGbfe74/ Follow this link to join my WhatsApp group: https://whatsapp.com/channel/0029VamwYOp89inl15KDVT3X 🙏 🔱 చంద్రశేఖర పాహిమాం 🔱 🙏
без подписи
13-08-2026 పంచాంగము
🕉️శ్రీ గురుచరిత్ర 10వ అధ్యాయము,🕉️ 🚩*శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి దివ్య లీలలు*🛕 https://youtu.be/eV-ecPJGbAc
🚩 మహాభారతం || అరణ్య పర్వము 🚩 📖 ద్వితీయాశ్వాసము (24) 🕉️ (సనాతన ధర్మం నుండి) 🕉️ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం | దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ || యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః | తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ || "వశిష్టాశ్రమంలో ఒక్క దినం నివసించినా, పింగం అనే పుణ్యతీర్థాన్ని సేవించినా, ప్రభాస తీర్థంలో లేదా వరదాన తీర్థంలో స్నానమాడినా, సరస్వతీ నదీ సంగమంలో స్నానం చేసినా అనంతమైన పుణ్యఫలాలు పొందుతారు. ద్వారావతీ పురంలోని పిండారక తీర్థంలో శివుని పూజించినా, సాగర సింధు సంగమంలో స్నానమాచరించినా, శంకు కర్ణేశ్వరంలో శివుని పూజించినా, వసుధార, వసు సరములలో తీర్థమాడినా, సింధూత్తమంలో స్నానం చేసినా, బ్రహ్మతుంగ తీర్థం సేవించినా, శక్రకుమారీ యాత్ర చేసినా, శ్రీకుండంలో బ్రహ్మదేవుని సందర్శించినా, బడబ తీర్ధంలో అగ్నిదేవుని సేవించినా... ఎన్నో గోదాన, భూదానములు చేసినంత పుణ్యఫలములు కలుగుతాయి. దేవిక అనే పుణ్యక్షేత్రములో సాక్షాత్తూ పరమశివుడు నివసిస్తాడు. ఆ క్షేత్రాన్ని, అలాగే కామ క్షేత్రాన్ని, రుద్రతీర్థాన్ని, బ్రహ్మవాలుకాన్ని, దీర్ఘసత్రాన్ని సేవించిన వారికి ఇష్టకామ్య సిద్ధి (కోరికలు నెరవేరడం) కలుగుతుంది. 'వినశనము' అనే ప్రాంతంలో అదృశ్యమయిన సరస్వతీ నది.. మళ్లీ నాగోద్భేద, శివోద్భేద, చమసోద్భేదంబులలో ఎక్కడైనా కనిపించినప్పుడు, అందులో భక్తిగా స్నానం చేస్తే నాగలోక ప్రాప్తి కలుగుతుంది. శశియానం తీర్థంలో స్నానం చేస్తే, సహస్ర (వెయ్యి) గోవులను దానం చేసిన పుణ్యం కలుగుతుంది. ఇక రుద్రకోటి తీర్థంలో పరమశివుని అర్చించిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది." సరళీకరణ: ✍️ తంగిరాల చంద్రశేఖర అవధాని 🗓️ తేదీ: 12 ఆగస్టు, 2026 📌 పేజీ/గ్రూప్: సనాతన ధర్మం మాతో కనెక్ట్ అవ్వండి: 🚩 Facebook: https://www.facebook.com/share/18BVkU8sFw/ 🚩 WhatsApp Channel: https://whatsapp.com/channel/0029VamwYOp89inl15KDVT3X సశేషం...
అవకాశం ఉన్న ప్రతీ ఒక్కరు ఈరోజు రామాయణం లోని శ్రీ సుబ్రహ్మణ్య జనన వృత్తాంతము శ్రవణము చేయగలరు, శ్రీమద్రామాయణము బాలకాండ 37వ సర్గ https://youtu.be/-zTBopbhXh0
🕉️ నడిపూడి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి 🐍 ఈరోజు మంగళవారం, 'కృష్ణాంగారక చతుర్దశి' సందర్భంగా విశేష అలంకారం లో నడిపూడిలో కొలువైన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం శ్లో" స్కందం శక్తిధరం దేవం మయూర వాహనం విభుమ్ | తారకాసుర హంతారం భక్తాభీష్ట ప్రదాయకమ్ || తాత్పర్యం:- శక్తి ఆయుధాన్ని ధరించినవాడు, దివ్యమైన నెమలిని వాహనంగా చేసుకున్నవాడు, తారకాసురుని సంహరించినవాడు, భక్తుల కోరికలను నెరవేర్చే ఆ స్కంద భగవానుడికి (కుమారస్వామికి) నమస్కరిస్తున్నాను. సనాతన ధర్మం నుండి తంగిరాల చంద్రశేఖర అవధాని, 11-08-2026, 🚩"ఓం శరవణ భవ"🚩